Khammam District (imagecredit:swetcha)
తెలంగాణ

Khammam District: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చరా?.. అధిష్టానం పై క్యాడర్ అలక

Khammam District: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎల్లప్పుడు విశిష్టత సంతరించుకుని ఉంటుంది. ఒకప్పటి తెలుగుదేశం పార్టీ(TDP) ఎన్టీఆర్(NTR), చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) లు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభంజనం సృష్టించిన సమయంలోనూ ఇక్కడి ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే సీటు గెలిచింది. తరువాత తెలంగాణ(Telangana) సెంటిమెంట్ రగిలి టిఆర్ఎస్(TRS) ప్రభంజనం సృష్టించిన సమయంలోనూ కాంగ్రెస్ను గెలిపించారు ఇక్కడి ప్రజలు. కమ్యూనిస్టుల ప్రాభాల్యం తగ్గాక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తిరుగు లేని శక్తి గా అవతరించింది. ఈ ఓటు బ్యాంకు తోడు ముస్లిం మైనార్టీ ల అండదండలు తోడవడంతో పలువురు బైటి నుండి వచ్చిన నేతలు ఇక్కడ నుంచి బాగానే చక్రం తిప్పారు. చక్కగా పదవులు అనుభవిస్తూ తమ సొంత బలంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని నమ్మిస్తూ తమ చెప్పు చేతుల్లో ఉంచుకోసాగారు.దీని కొనసాగింపుగానే మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తాము వేలుపెట్టం అంటూ చేతులెత్తేయడంతో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన క్యాడర్ నిరాశ నిస్ప్రుహ లకు గురౌతోంది.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో..

ద్వితీయ శ్రేణి నుండి నాయకత్వాన్ని చేపట్టే స్థాయికి చేరిన క్యాడర్ కు ప్రతి సారి ఏదోక వంకతో నిరాశే ఎదురౌతుందని అంటున్నారు . ఒకసారి ఎన్నికల పొత్తు కోసం త్యాగం చేయాల్సి వస్తుండగా మరొక సారి పార్టీ అధికారం లోకి రావాలనే అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ త్యాగాలు చేసిన చరిత్ర ఖమ్మం జిల్లా కేడర్ కు ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వెంటఉన్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కేడర్ కు తగిన పదవులు కట్టబెట్టాలనే ఆలోచన తో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో డిసిసి అధ్యక్ష పదవి ని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని నిర్ణయించారని విస్వసనీయంగా తెలిసింది . హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజమాబాద్ , ఖమ్మం జిల్లాల డిసిసి అధ్యక్ష పదవులను ముస్లింలకు కేటాయించాలని, ఆ మేరకు తగిన అభ్యర్థుల పరిశీలన చేస్తున్నారని సమాచారం. తాజాగా ఖమ్మం నగరంలోని ఉర్దూ ఘర్ షాదీ ఖానా మేనేజ్ మెంట్ కమిటీ లో సభ్యులు గా కొందరి పేర్లు ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తో సహా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానాలకు పలువురు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ పడుతున్నారు. అందులోనూ డిసిసి అధ్యక్ష పోస్టు ను గట్టిగా కోరుతున్నారు.

Also Read: Konda Surekha: రైతులు ఎవరు అదైర్య పడవద్దు నష్టపరిహరం చెల్లిస్తాం: మంత్రి కొండ సురేఖ

ముస్లిం సామాజిక వర్గం

ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా గత 70 ఏళ్ళ చరిత్ర లో ముస్లింలు తప్ప అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాతినిధ్యం దక్కిందంటున్నారు ఇక్కడి కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఖమ్మం జిల్లాలో రెండు లక్షల 40 వేల మంది జనాభా ఉండి బీసీల్లో ముస్లింలు అంతర్భాగ మైనందున సామాజిక పరంగా ముస్లింలకు సరైన గౌరవం దక్కాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం అసెంబ్లీ స్థానం ముస్లింల కేటాయించింది. నాడు ఖమ్మం సీటు గెలుపొందిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న చోట కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉండి గెలుపు కోసం కృషి చేసే విధంగా ప్రయత్నిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ గెలుపును ప్రభావితం చేసే ముస్లింల ఓటు అంశం తెరమీదకు వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ముస్లిం మైనారిటీలకు వరించేనా? 6 జిల్లా ల్లో అత్యధికంగా ఉన్న ముస్లిం లు కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలుస్తున్నారు. అందులో ఖమ్మం సెగ్మెంట్ కూడా ఉంది.

టిడిపితో కమ్యూనిస్టులు మిత్ర పక్షాలు

ఇక్కడ 2009వరకు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇక్కడి ఎమ్మెల్యే టికెట్ ముస్లిం లకే కెటాయిస్తు వచ్చింది . ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కామ్రేడ్ రజబ్ అలీ కి ఇక్కడి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే పదవి ముస్లిం కోటా లోనే కట్టబట్టిందని చెబుతారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 1979లో కమాల్ ఖాన్ కు కాంగ్రెస్ టికెట్ కెటాయిస్తే గెలిచారని గుర్తు చేస్తున్నారు.1983లో ముజాఫరుద్దీన్ కు 1994 లో మహమ్మద్ జహీర్ అలి లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కందీ. ఆ సమయంలో టిడిపితో కమ్యూనిస్టులు మిత్ర పక్షాలు గా ఉన్నందున స్వల్ప తేడాతో ఓడిపోయారు.1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూనిస్ సుల్తాన్ ఖమ్మం సీటు పై గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో(2018) ఇక్కడ నుంచి టీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఖమ్మం పార్లమెంట్ టికెట్ దక్కించుకున్న బుడాన్ బేగ్ మంచి ఓట్లు సాధించారు. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిని , ఒకప్పుడు సిపిఐ రజబ్ అలీ ని ప్రోత్సాహిస్తే , తరువాత సిపిఎం ఖమ్మం మున్సిపాలిటీ ఛైర్మన్ సీటు అఫ్రోజ్ సమీనాకు (ముస్లిం లకు) కటకట్టబెట్టి ఆ సామాజిక వర్గాన్ని ప్రోత్సాహించిన చరిత్ర ఉందీ ఇక్కడ . ఐతే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జోక్యం చేసుకోము అంటూ పార్టీ అధిష్ఠానం చేతులు ఎత్తేయడం ఎంతవరకు సమర్ధనీయమో చెప్పండి అంటూ కాంగ్రెస్ కేడర్ మొరపెట్టుకుంటున్నారు.

Also Read: Vizag Crime: మహిళా లెక్చరర్ల వేధింపులు.. విశాఖ విద్యార్థి సూసైడ్‌లో భారీ ట్విస్ట్.. వాట్సప్ చాట్ లీక్!

Just In

01

Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Vasudheva Sutham: మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’కు ఆకాష్ జగన్నాథ్ సపోర్ట్!

Kapas Kisan App: కౌలు రైతుల‌కు క‌పాస్ క‌ష్టాలు.. 32వేల ఎక‌రాలు పంట న‌ష్టం

Collector Rizwan Basha: రైతులు అధైర్య పడొద్దు ఆదుకుంటాము: క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా

MLA Kaushik Reddy: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్