Municipal Elections: మున్సిపాలిటీల పై ప్రధాన పార్టీల ఫోకస్..!
Municipal Elections (imagecredit:swetcha)
Telangana News, రంగారెడ్డి

Municipal Elections: మున్సిపాలిటీల పై ప్రధాన పార్టీల ఫోకస్.. అందరి చూపు అటు వైపే..?

Municipal Elections: చైర్ పర్సన్ లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అడుగులు
-ప్రతిష్టత్మకంగా తీసుకున్న పార్టీల నేతలు
-అధికార పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్
-పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు
-బీజేపీ కి అనుకూలమైన ఎన్నికలంటూ నేతల ధీమా

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రధాన పార్టీల నేతలు సిద్దమైతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీ చైర్పర్సన్ లను దక్కించుకునేందుకు నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హారహోరిగా అభ్యర్థుల వేటలో ఉన్నారు. గత పదేండ్లుగా బీఆర్ఎస్ మున్సిపాలిటీలను తమ చేతులో పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించరనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. అక్కడక్కడ బీజేపీ రెండోవ స్థానం కాపాడుకుంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిని కౌన్సిలేర్లు అధికారం లేకపోవడంతో బీఆర్ఎస్ లో చేరిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని కంకణంతో ఉన్నట్లు తెలుస్తుంది.

జోషు కలిసి వచ్చేనా…!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్లో విజయం సాధించింది. పార్లమెంట్ ఎలక్షన్ లో తర్వాత అసెంబ్లీ బై ఎలక్షన్లో, గ్రామపంచాయతీ ఎలక్షన్లో వచ్చిన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ జోషులో ఉంది. అదే జోషుతో మున్సిపాలిటీ ఎన్నికల్లో అడుగులు వేసేందుకు ఉత్సాహపడుతుంది. రంగారెడ్డిలోని 7, మేడ్చల్-మల్కాజిగిరిలో 3, వికారాబాద్ లోని 4మున్సిపాలిటీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతి మున్సిపాలిటీ గెలిపించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. అందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీలున్న నియోజకవర్గం ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జీలతో మంత్రులు మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితిలో రెబల్స్ అభ్యర్థులు లేకుండా, కొత్త, పాత వర్గాలకు చెక్ పెట్టి గెలుపు గుర్రాలనే బరిలో దించాలని అధిష్టానం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్ల బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, మహిళా సంఘాలకు వ్యాపారాలు, విరివిగా రుణాలు, వడ్డీ చెల్లింపు తదితర సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకుకెళ్లి ఓట్లు అడిగేందుకు సిద్దమవుతున్నారు.

Also Read: Bhatti Vikramarka: అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు… డిప్యూటీ సీఎం భట్టి స్పష్టత

పట్టు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాంతో బీఆర్ఎస్ మాకు తిరుగు లేదని అనుకున్నది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందింది. ఆ తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో పార్టీ క్యాడెర్ తీవ్ర నిరాశలోకి వెళ్ళింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలా వ్యూహాలు చేస్తుందనే విషయంపై పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారు. పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల అన్వేషణలో ఉంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు గెలుపు సాధిస్తేనే క్యాడర్ ఉంటుందని పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని నేతలు ఆలోచిస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు సీరియస్ గా మున్సిపాలిటీ ఎన్నికల పై ఫోకస్ పెట్టారు.

మున్సిపాలిటీల పై బీజేపీ ధీమా..

బీజేపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీజేపీ శ్రేణులను నిరాశపర్చిన పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా సర్పంచ్ స్థానాలు గెలిచామనే సంతోషంలో ఉంది. అయితే ప్రస్తుతం జరిగే ఎన్నికలు పట్టణ ప్రాంతంలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీ కి అనుకూలంగా ఉంటాయని నేతలు దీమాలో ఉన్నారు. యువత, విద్యావంతులు, మేధావులతోపాటు హిందువులు బీజేపీ వైపే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో మోడీ ప్రభావం అధికంగా ఉన్నట్లు వివరిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు అధికంగా ఉన్నారు… బీజేపీ నుంచి పోటీ చేయాలని అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నట్లు నేతలు ప్రచారం చేసుకున్నట్టున్నారు.

ఈ మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు..

రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్, షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, అమన్గల్లు, కొత్తూరు… ఇందులో చేవెళ్ల, మొయినాబాద్ లు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు మొదటి సారిగా ఎన్నికలు కానున్నాయి. వికారాబాద్ జిల్లాలో పరిగి, తాండూర్, కొడంగల్, వికారాబాద్… మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట, ఆలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: Minister Sridhar Babu: మా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం: మంత్రి శ్రీధర్ బాబు

Just In

01

Traffic Challans: ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు సీరియస్.. చలాన్లు కట్టాలని బలవంతం చేయవద్దు..!

Urea App: యూరియా కోసం ఒక యాప్.. ఆర్గానిక్ పంటలకు మరో యాప్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Phone Tapping Case: ఆ కీలక నేత ఎవరో నాకు తెలియదన్న హరీష్ రావు.. త్వరలో మరికొందరికి నోటీసులు

CM Revanth Reddy: తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకొచ్చిన ఎక్స్‌పర్టైజ్, అలోన్ స్టోపెల్ ప్రతినిధులు

Hyderabad GCC: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు తమ సంస్థ సానుకూలం: విల్లెమ్ ఉయిజెన్