Minister Sridhar Babu: పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం
Minister Sridhar Babu (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Minister Sridhar Babu: మా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) కోరారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు రావాలని కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా మంగళవారం దావోస్‌లో ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు..

ఊతమిచ్చే కీలక రంగాలకు

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా దార్శనికతతో కూడిన ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, హెల్త్ కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఏరో స్పేస్, డిఫెన్స్, టెక్స్ట్ టైల్, అప్పారెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఇక్కడి ఎకో సిస్టం గురించి వివరించారు.

Also Read: Medaram Jatara 2026: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. జాతరలో ఆ భయం లేదిక..?

ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తి..

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించిందని చెప్పారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పారిశ్రామికాభివృద్ధికి ఉత్తమిచ్చేలా రూపొందించిన పాలసీలను వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. “తెలంగాణ బ్రాండ్” మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.O, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు.

Also Read: Renu Desai: అందుకే తరచూ కాశీకి వెళ్తుంటానంటూ చెప్పుకొచ్చిన రేణు దేశాయ్..

Just In

01

CM Revanth Reddy: తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకొచ్చిన ఎక్స్‌పర్టైజ్, అలోన్ స్టోపెల్ ప్రతినిధులు

Hyderabad GCC: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు తమ సంస్థ సానుకూలం: విల్లెమ్ ఉయిజెన్

Bharat Future City: దావోస్‌లో సీఎం రేవంత్‌తో యూఏఈ ప్రభుత్వం చర్చలు.. భాగస్వామ్యులం అవుతామంటూ..!

Municipal Elections: మున్సిపాలిటీల పై ప్రధాన పార్టీల ఫోకస్.. అందరి చూపు అటు వైపే..?

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సమావేశం.. కీలక రంగాల్లో సహకారంపై చర్చ..!