Chamala Kiran Kumar (Image Source: Twitter)
తెలంగాణ

Chamala Kiran Kumar: ప్రధాని పంద్రాగస్టు ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్!

Chamala Kiran Kumar: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ (PM Modi) ఎర్రకోట (Red fort) వేదికగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ అనుబంధ విభాగం ఆర్ఆర్ఆస్ (RSS) గురించి ప్రస్తావించిన మోదీ.. దానిపై ప్రశంసలు కురిపించారు. దీనిపై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ (Congress MP) చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవాల్సిన మాటలను.. ఎర్రకోటపై చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రాల విషయంలో ప్రధాని చెప్పిన మాటలు.. వాస్తవాలకు చాలా చూరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ చామల ఏమన్నారంటే?
‘ప్రధాని మోదీ లాల్‌ కిలా జండా ఎగురవేస్తూ ఆర్ఆర్ఎస్ గురించి ప్రస్తావించారు. ఆ సంస్థ దేశాభివృద్ధికి, సమగ్రతకు ఏ విధంగా పనిచేస్తుందో గొప్పలు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన అక్కడ మాట్లాడే బదులు బీజేపీ ఆఫీసులో మాట్లాడి ఉండి ఉంటే మాకేలాంటి అభ్యంతరం ఉండేది కాదు. నాగ్ పూర్ లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ హెడ్‌ క్వార్టర్‌ పై ఇవాళ జెండా ఎగురవేయలేదు. త్రివర్ణ పతకాన్ని ఆర్ఎస్ఎస్ ఆగౌరవపరిచింది. మూడు రంగుల జెండా ఎగుర వేసి ప్రధాని ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ల అజెండాను చదివి వినిపించినట్లు ఉంది’ అని చామల అన్నారు.

Also Read: AP Free Bus: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇక బస్సుల్లో అంతా ఫ్రీ ఫ్రీ

ఏపీ కోసం తెలంగాణకు అన్యాయం
ప్రధాని మోదీ సెమీ కండెక్టర్లు, రాష్ట్రాల మధ్య పోటీతత్వం గురించి మాట్లాడారని చామల అన్నారు. మరి సెమీ కండెక్టర్ల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణలో సెమీ కండక్టర్ కంపెనీ పెట్టాలని ఓ సంస్థ వస్తే.. దానిని ఆంధ్రాలో పెట్టేలా కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) కేంద్రంలో పొత్తులో ఉన్నందువల్ల సెమీ కండక్టర్ కంపెనీని పక్క రాష్ట్రానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అంతకుముందు కూడా తెలంగాణలో పెట్టాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ను గుజరాత్ కు తరలించుకుపోయారని మోదీపై చామల మండిపడ్డారు.

Also Read This: UP Horror: భార్య చేతిలో చివాట్లు.. కోపంతో బిడ్డను చంపేసిన భర్త.. ఎక్కడంటే?

‘తెలంగాణను పట్టించుకోవడం లేదు’
దేశానికి ప్రధాని అంటే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని ప్రధాని మోదీకి చామల గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు వచ్చేలా చూడాలని సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్‌ (CM Revanth Reddy) ఏడాదిన్నర కాలంగా మిమ్మల్ని, మీ మంత్రులను పదే పదే కలుస్తున్నారని ఎంపీ చామల అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరినా ప్రధాని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణను మరిచిపోయారని ప్రధానిపై మండిపడ్డారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారన్న సంగతి కూడా గుర్తులేదా? అని నిలదీశారు.

Also Read This: CM Revanth Reddy: ఏపీతో జల వివాదం.. గోల్కొండ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్