MP Chamala Kiran: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా
ఇంకెంత కాలం తప్పించుకుంటారు?
ప్రతిపక్ష నేత హోదా తీసుకోవాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలంటూ మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (ktr) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran) సవాలు విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే అసెంబ్లీకి రాకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు లేకనే కేసీఆర్ (KCR) అసెంబ్లీకి రాకుండా భయపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. వెంటనే కేటీఆర్ ప్రతిపక్ష హోదాను స్వీకరించాలని సూచించారు. అధికార పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వచించలేదా? అని అని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
ఉద్యమకారుడి అవతారం ఎత్తి జనాలను మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలో హైదరాబాద్ నిజంగా అభివృద్ధి చెంది ఉంటే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ హయంలో విచ్చలవిడిగా కబ్జాలు జరిగాయని, వాటిని అడ్డుకునేందుకు హైడ్రాపై విష ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని వెల్లడించారు.
బీఆర్ఎస్ రెచ్చకొట్టి రాజకీయం
ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు
అధికారం ఇక కలగానే మిగలనున్నది: ఎంపీ మల్లు రవి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ పార్టీ రెచ్చకొట్టి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నదని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతల్లో ప్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఆ పార్టీ మళ్లీ పవర్‌లోకి రావడం కలగానే మిగలనున్నదన్నారు. రాజకీయాలు హుందాగా నడపాలని, రెచ్చకొట్టి కక్షపూరితంగా వ్యవహరించకూడదని సూచించారు. బీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇది రాజకీయాలలో మంచి పరిణామం కాదన్నారు. కేటీఆర్, కేసీఆర్‌లు పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని హితవు పలికారు. సీఎం హోదాకు గౌరవించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేటీఆర్ ఎన్నో బహిరంగ సభలలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి అంతర్గత మార్పులు.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఛాన్స్?

