Montha Cyclone: రైతులకు మొంథా తుఫాన్ (Montha Cyclone) కన్నీరు మిగుల్చుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చేతికి వచ్చిన పంటచేలు నీటమునిగాయి. వరి, పత్తి, మిర్చి, మొక్క జొన్న, సోయాబిన్ సైతం దెబ్బతిన్నాయి. వరిపైరు నేలకొరిగింది. నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్నది. కొంతమంది రైతులు ధాన్యంను మార్కెట్లకు తరలించగా, భారీ వర్షాల కారణంతో తడిసి ముద్దైంది. ఐకేపీ కేంద్రాల్లో వరద నీరు ప్రవహించింది. దీంతో ధాన్యం కొట్టుకుపోయింది. అంతేకాదు కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫలిన్లు సైతం సరిపడలేకపోవడంతో రైతులై పట్టాలు కప్పుకున్నాయి. అయినప్పటికీ భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసింది. అంతేకాదు కొన్ని కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసినప్పటికీ తరలింపులో జాప్యంతో తడిసిందని రైతులు పేర్కొంటున్నారు.
Also Read: Montha Cyclone: తెలంగాణకు మొంథా ముప్పు.. ఈ జిల్లాల్లో అతితీవ్ర వర్షాలు.. ఆకస్మిక వరదలు
227.8 మీమీ వర్షపాతం
వర్షం కారణంగా ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచనలు చేసింది. అంతేగాకుండా అధిక వర్షం నమోదు అవుతున్న ప్రాంతాల్లో ప్రజలు అలర్టుగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం అధికారులను అలర్టు చేసి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వర్షపాతం నమోదు అయింది. 18 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 367 మీల్లి మీటర్ల వర్షం నమోదు అయింది.అదే జిల్లా రెడ్లవాడలో 316 మీమీ, హనుమకొండ జిల్లాబీమాదేవరపల్లిలో 292.5 మీమీ, వరంగల్ జిల్లా వర్దన్నపేటలో 286.8మీమీ, కాపులకనపర్తిలో 282.3 మీమీ, జనగాం జిల్లా గూడూరులో 263.5 మీమీ, సిద్దిపేట జిల్లా కట్కూరులో 240 మీమీ, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 227.8 మీమీ వర్షపాతం నమోదు అయింది.
8 జిల్లాలకు రెడ్ అలర్టు
రాష్ట్రంలోని 16 జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందులో 8 జిల్లాలు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్టు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో మోస్తారు వర్షం కురువనుందని అధికారులు తెలిపారు.
Also Read: TG CM – Cyclone Montha: తెలంగాణపై మెుంథా ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
