MLC Ravindhar Rao: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు(MLC Ravindhar Rao) అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడా చూసినా పారిశుధ్య లోపం కనిపిస్తోందన్నారు. హైదరాబాద్(Hyderabad) సహా పల్లెల దాకా ఎక్కడ చూసినా చెత్తనే కనిపిస్తోందని ఆరోపించారు. పంచాయతీలకు చెత్త సేకరణకు ఇచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ లేక సరెండర్ చేస్తున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై సమ్మె బాట పడుతున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో
పల్లెల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు అన్నారు. స్థానిక ఎన్నికలు(Local elections) పెట్టలేదు కనుక కేంద్ర నిధులు గ్రామాలకు రావడం లేదని, దీంతో పల్లెలు మురికి కూపాలు గా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ(BC) లకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని తెలిసి కాంగ్రెస్(Congress) మోసపూరిత మాటలు చెప్పిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలు పెట్టడం ఇష్టం లేదన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన 73 ,74 రాజ్యాంగ సవరణలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఉల్లంఘించడం శోచనీయం అన్నారు.
Also Read: Madhya Pradesh: షాకింగ్ ఘటన.. లేడీ టీచర్‌పై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన స్టూడెంట్
ఎపుడూ అధికారం లోకి వచ్చినా
స్థానిక ఎన్నికలు ఐదేళ్ల కోసారి ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ సవరణలకు కాంగ్రెస్ ఎపుడూ అధికారం లోకి వచ్చినా తూట్లు పొడుస్తోందన్నారు. ప్రజలు అంటు వ్యాధులతో సతమతమవుతున్నారని, డెంగీ ,మలేరియా విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికలు జరగకపోతే పల్లెల్లో నిధులు రాక పరిస్థితులు గాడి తప్పుతాయని, రేవంత్(Revanth) పాలనలో ఎవరూ సంతోషంగా లేరు అన్నారు. పరిస్థితులు చక్కదిద్దకపోతే బీ ఆర్ ఎస్(BRS) ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నేత రాఘవ పాల్గొన్నారు.
Also Read: Spiny Gourd Benefits: బోడ కాకరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?