BC Reservation Bills (imagecredit:twitter)
తెలంగాణ

BC Reservation Bills: బీసీలకు బీజేపీ సానుకూలమా.. స్పష్టత ఇవ్వండి

 BC Reservation Bills: బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు(N Ramchander Rao) ను కోరారు. రామచందర్ రావుకు లేఖ రాశారు. తెలంగాణలో బీసీ(BC)లకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం సహకారం అందించాలని కోరారు. తరతరాలుగా సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు.

స్థానిక సంస్థల్లో(Local Body Elections) ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోందన్నారు.

Also Read: Sugar Mill: రాత్రికే రాత్రే కరిగిపోయిన రూ.60 కోట్ల విలువైన పంచదార

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి, యూపీఎఫ్(UPF) ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని, బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చిన తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో రెండు వేర్వురు బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందన్నారు. అయినా ఆమోదముద్ర పడలేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మీపైనే ఉన్నదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు చట్టరూపం తెచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. తద్వారా బీసీ సమాజానికి మీ పార్టీ సానుకూలమని స్పష్టతనివ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు వెంటనే రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Electricity Department: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సమీక్ష!

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు