షాద్ నగర్ స్వేచ్ఛ : Veerlapally Shankar: ప్రజా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూనే ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనను కొనసాగిస్తుందని అన్నారు.
Also Read ; NFBS scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా? కష్ట సమయంలో ఇదే ఆధారం.. తప్పక తెలుసుకోండి
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఆలీ ఖాన్, నాయకులు రఘునాయక్, తిరుపతి రెడ్డి, బస్వం, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పిటిసిలు వెంకట్రామిరెడ్డి, విశాలాశ్రవణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, నాయకులు జితేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సీతారాములు, సుదర్శన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు