Crop Compensation: నష్టపోయాం.. ఆదుకోండి సీఎం సార్..
Crop Compensation [image credit: AI]
Telangana News

Crop Compensation: నష్టపోయాం.. ఆదుకోండి సీఎం సార్..

కరీంనగర్​, స్వేచ్ఛ: Crop Compensation: పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఈనెల 21న కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన రైతులు పంట నష్టపోయారని, వారికి తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని, అందుకు నిధులు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదారాబాద్ లో అసెంబ్లీ హాల్లో సీఎం ఛాంబర్ లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే విజయ రమణారావు కలిసి పంట నష్టం, రైతులకు పరిహారం చెల్లింపుపై వినతిపత్రం అందజేశారు.

Also Read: Hyderabad Crime: న్యాయవాది దారుణ హత్య.. రెక్కి చేసి మరీ..

పెద్దపల్లి నియోజకవర్గంలోని 2 మండలాల్లోని 11 గ్రామాల్లో 1035 మంది రైతులకు చెందిన వరిపంట దెబ్బతిందని, 6 మండలాల్లోని 28 గ్రామాల్లో 828 మంది రైతులకు చెందిన 1084 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు వర్షం వల్ల నష్టం వాటిల్లిందని సీఎంకు తెలిపారు. ఒక మండలంలోని గ్రామంలో 30 మంది రైతులకు సంబంధించి 20 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో పంటనష్టం సర్వే చేయించి ప్రాథమిక అంచనా రూపొందించామని పేర్కొన్నారు.

Also Read: Telangana Govt: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఉగాది నుండి కొత్త పథకం ప్రారంభం..

తాను స్వయంగా పెద్దపల్లి నియోజక వర్గంలోని పంటపొలాలు, మొక్కజొన్న చేన్లు, కూరగాయల తోటలను పరిశీలించి పంట నష్టంపై అధికారులతో సమీక్షించానని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 1896 మంది రైతులకు చెందిన 2627 ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పంటనష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఇందుకు గాను దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఇక్కడ  https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..