Miss world 2025 (imagecredit:swetcha)
తెలంగాణ

Miss world 2025: అనాథ చిన్నారులతో.. అందాల భామలు డ్యాన్స్ అదరహో!

Miss world 2025: హైదరాబాద్ లోని హోటల్ ట్రిడెంట్‌ లో మిస్ వరల్డ్ పోటీదారులతో “హార్ట్ ఆఫ్ గోల్డ్” పేరిట ఓ వినూత్నమైన చారిటీ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీస్ బాలసదన్‌లలోని అనాథ చిన్నారులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ను కలిసే అవకాశం చిన్నారులకు కలిపించింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చిన్నారులతో ముచ్చటించారు. వారితో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సెల్ఫీ, వీడియోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. లైవ్ బ్యాండ్ సంగీతానికి వారు చిన్నారులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్

మిస్ వరల్డ్ సంస్థతో కలిసి బాలసదన్లోని 200 మంది అనాథ పిల్లలకుఏడాది పాటు సహాయం చేసేందుకు ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ , సుదీక్ష ఎస్టేట్స్ సంస్థలు స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించాయి. విద్యా , పాఠ్యపుస్తకాలు, పోషకాహార, నెలవారీ రేషన్ సరఫరా, దుస్తులు, స్వెటర్లు, రెయిన్‌కోట్లు, డ్రెస్సులు, స్కూల్ కిట్లు (స్కూల్ బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్‌లు), టాయిలెట్రీలు మరియు బాత్‌రూమ్ అవసరాలు, డిజిటల్ వాచ్‌లు , విద్యా ఆటబొమ్మలు, వ్యక్తిగత వస్తువుల కోసం ట్రాలీ బ్యాగ్‌లు, ప్రోటీన్ పౌడర్ , సప్లిమెంట్లు తో కూడిన 200 కిట్లను చిన్నారులకు అందించారు. ఒక్కో చిన్నారికి పోటీదారులు చేతులమీదగా ఈ కిట్లను అందజేశారు. ఈ సహాయం ఏడాది పాటు చేస్తామని దాతలు ప్రకటించారు. అదేవిధంగా విక్టోరియా మెమోరియల్ పాఠశాల పూర్తిస్థాయి పునరుద్ధరణను కూడా దాతలు ముందుకు వచ్చారు.

Also Read: Kamal Haasan: కమల్ హాసన్‌‌కు సూపర్ ఛాన్స్.. సీఎం సపోర్ట్‌తో ఎంపీగా ఖరారు!

థింక్ బిగ్, థింక్ డిఫరెంట్ అచీవ్ గోల్స్

మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్ , సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ,ఇది ‘బ్యూటీ విత్ పర్పస్’ యొక్క సారాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో మమేకమైన తీరు వారి సేవా నిబద్ధతను చాటుతోందన్నారు. విద్య తో నే విజయం, థింక్ బిగ్, థింక్ డిఫరెంట్ అచీవ్ గోల్స్ అంటూ పిల్లలు అడిగిన ప్రశ్నలకు స్ఫూర్తి దాయక సందేశాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు” అని పేర్కొన్నారు. సామాజిక సేవ పట్ల తమ లోతైన ఆసక్తిని పంచుకుంటూ, చిన్నారుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ జిల్లాల బాలసదనాల పిల్లలకు ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫామ్‌లో కొత్త అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. చిన్నారులకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే రోజు అనడంలో సందేహం లేదు.

Also Read: Sr NTR Speech: మహానాడులో ఏఐ అద్భుతం.. కదిలొచ్చిన అన్నగారు..

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!