Inter Results (imagecredit:twitter)
తెలంగాణ

Inter Results: ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంత్రి సీత‌క్క శుభాకాంక్ష‌లు

తెలంగాణ: Inter Results: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకి పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల‌ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్ధుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫ‌లితాల్లో త‌న సొంత జిల్లా ములుగు మొద‌టి స్థానంలో, తాను ఇంచార్జీగా ఉన్న‌ ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో నిల‌వడం ప‌ట్ల మంత్రి సీత‌క్క హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

వెన‌క‌బ‌డిన జిల్లాలు, గిరిజ‌న ప్రాంతాలుగా పేరున్న ఈ రెండు జిల్లాల విద్యార్దులు ఇంట‌ర్ ఫలితాల్లో స‌త్తా చాటడం తన‌కు ఎంతో సంతోషానిచ్చింద‌న్నారు. ఈ విజ‌యానికి కార‌ణ‌మైన ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను, డీఈవోల‌ను, ఇతర అధికారుల‌కు మంత్రి సీత‌క్క అభినంద‌న‌లు తెలిపారు.

మొద‌టి స్థానంలో ములుగును నిల‌ప‌డంలో కృషి చేసిన క‌లెక్ట‌ర్, ఐటీడీఏ అధికారులు, డీఈవో ను మంత్రి సీత‌క్క ప్ర‌త్యేకంగా అభినందించారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వారిని శాలువాల‌తో మంత్రి సీత‌క్క స‌న్మానించారు. విద్యా ప్ర‌మాణాల‌ను పెంచ‌డంలో త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క గుర్తు చేశారు.

Also Read: Viral Video: టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఇలా తయారేంట్రా బాబు..

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్