మత్స్య కారుల అభివృద్ధికి కృషి.. రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం.
Vakiti Srihari (image credit: swetcha reporter)
Telangana News

Vakiti Srihari: మత్స్య కారుల అభివృద్ధికి కృషి.. రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం.. మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari: మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలోహెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా 2025 కాన్ఫఫెరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్య శాఖపై రూపొందించిన పాటను విడుదల చేశారు. మత్స్య సంపద, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి పైన ప్రధాన చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, మంత్రి వాకిటి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు మత్స్య శాఖను ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని, మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిందన్నారు. నిర్వీర్యానికి గురైన మత్స్యశాఖను పునర్నిర్మాణం చేస్తూ తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి క్యాబినెట్‌లోనే మత్స్య శాఖకు దాదాపుగా రూ.123కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు.

Also Read: Vakiti Srihari: చేపపిల్లలు చెరువుకు చేరాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి వాకిటి శ్రీహరి

84 కోట్ల చేప పిల్లలు

కోటి 40 లక్షలతో మత్స్యకారులకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదులు మధ్య తెలంగాణ ఉండటమే కాకుండా గొలుసు కట్టు చెరువులు ఒక గొప్ప వరం అన్నారు. ఈ నీటి వనరులు మత్స్య సంపదకు దోహద పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 26వేల నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వీటిల్లో 84 కోట్ల చేప పిల్లలు,10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామన్నారు. పారదర్శకతకు కేర్ ఆఫ్ అడ్రస్స్‌గా చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

మత్స్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తాం

చెరువు వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేసి చేపపిల్లల వివరాలను తెలియజేస్తున్నామన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరి సహకారంతో రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు ఆహారం అమలయ్యేలా చూస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఎన్ఎఫ్డీబీ సీఈవో బెహరా, జాయింట్ సెక్రెటరీ నీతూకుమారి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్ జాయ్ కృష్ణ, పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞాన ప్రకాష్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Doctor Murder Case: నీ కోసం నా భార్యను హత్య చేశా.. డాక్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుగొల్పే నిజాలు

Just In

01

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే

Illegal Medical Shops: ఎవరైనా దీనిని తనిఖీ అంటారా?.. చెకింగ్‌కు వెళ్లి అధికారులు చేస్తున్న పనిది