Minister Seethakka: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం మంత్రి సీతక్క సమక్షంలో రాంనగర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గాదే జయకృష్ణ, సుమారు 20 మంది నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీతక్క.. అనంతరం మాట్లాడారు. ములుగు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని చెప్పారు. అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. గ్రామాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాకుండా ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి చిన్న గ్రామ పంచాయతీలకు రూ. 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు.
Also Read: Wolf Supermoon: కొత్త ఏడాదిలో బిగ్ సర్‌ప్రైజ్.. ఆకాశంలో తోడేలు చందమామ.. ఇప్పుడు మిస్సయితే..
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాలతో పాటు మున్సిపాలిటీలను కూడా మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు పెద్దగా అభివృద్ధి చెందవని చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, PACS మాజీ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

