Seethakkaa
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Seethakka: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Seethakka:

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం
విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల్లో చేరాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు అమలు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క వెల్లడి

మహబూబాబాద్, స్వేచ్ఛ: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఎంపీ యూపీఎస్ కొత్తగూడ పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా. వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి బలమైన పునాదివేసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read this- Vijay Rupani: నంబర్1206.. మాజీ సీఎం తలరాత కాకపోతే మరేంటి?

పిల్లల భవిష్యత్‌కు భరోసా
ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ, పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులు నమ్మకం పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బడిబాట కార్యక్రమంలో ముందుకొచ్చి భాగస్వాములవ్వాలని ఆమె కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, బాలల భవిష్యత్తుకు అవి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి మహిళ స్వయం సహాయక పొదుపు సంఘాల్లో సభ్యురాలుగా చేరాలని మంత్రి సీతక్క సూచించారు.

Read this- Air India flight: మరో ఎయిర్ఇండియా విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్.. చివరికి!

మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెద్దపీట వేస్తూ వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందిస్తున్నారని మంత్రి సీతక్క ప్రస్తావించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెంది నూతన చైతన్యంతో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఆయన కొనియాడారు. విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని వివరించారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పౌష్టిక ఆహారం అందిస్తూ ఎగ్ బిర్యానీ, నూతన మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని ప్రస్తావించారు. అన్ని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, డిగ్రీ కాలేజ్, పాకాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాకాల కొత్తగూడెం గంగారం వరకు సాగునీరును ఇవ్వడం కోసం ప్రత్యేక కార్యాచరణ చురుకుగా కొనసాగుతుందని సీతక్క అన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?