Telangana government: పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారంపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వహించకుండా, నకిలీ హాజరు ద్వారా ఉద్యోగ బాధ్యతల్ని నెరవేరుస్తున్న పలువురు పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విధానాల ప్రకారం, పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే మొబైల్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదవ్వాలి. అయితే, కొంతమంది కార్యదర్శులు ఇతరుల సహాయంతో, లేదా తమ మొబైల్ ఫోన్లు మల్టీ పర్పస్ వర్కర్లకు ఇచ్చి, తాము లేకుండానే యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా తమ పాస్‌పోర్ట్ ఫొటోలను వాడి హాజరు నమోదు చేసిన ఉదంతాలూ ఇటీవల వెలుగుచూశాయి.
Also Read: Uttarakhand Tragedy: దేశంలో ఘోరం.. బాలుడ్ని పొట్టనపెట్టుకున్న 5 ఆస్పత్రులు.. రంగంలోకి సీఎం!
కొన్నిచోట్ల ఖాళీ కుర్చీలను ఫొటోలు తీసి అటెండెన్స్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. జిల్లాల వారీగా పదుల సంఖ్యలో ఇలాంటి ఫేక్ హాజరు కేసులు వెలుగుచూస్తుండగా, పంచాయతీ కార్యదర్శుల సంఘాలు ఈ మోసపూరిత వ్యవహారాల వల్ల మొత్తం వ్యవస్థపై అపవాదులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ఫేక్ అటెండెన్స్ వేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు, సంబంధిత జిల్లాల డీపీవోలకు ఆ ఉద్యోగులపై సస్పెన్షన్ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లకు నివేదికలు పంపించి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఫేక్ అటెండెన్స్ చేసిన పంచాయతీ కార్యదర్శులు, పర్యవేక్షించకుండా వదిలేస్తున్న అధికారులపై మంత్రి సీతక్క ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జీ. సృజన డీపీఓలను ఆదేశించారు. ఫేక్ అటెండెన్స్‌తో ఉద్యోగాలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు ఖాయమైంది. త్వరలోనే ఫేక్ అటెండెన్స్ వేస్తున్న కార్యదర్శుల జాబితాను సైతం వెల్లడికానున్నట్లు సమాచారం.
Also Read: Meenakshi Natrajan: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. రంగాపూర్ నుంచి పాదయాత్ర షురూ!