Minister Seethakka( image CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Minister Seethakka: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం.. మంత్రి సీతక్క స్పష్టం

Minister Seethakka: ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే పేదరికం అంతం అవుతుంది అని మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో సరస్ మేళాను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. హైటెక్ సిటీ వంటి విలువైన ప్రదేశాన్ని గ్రామీణ మహిళల చేతివృత్తులు, ఉత్పత్తుల ప్రదర్శన కోసం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం తమ సంకల్పమన్నారు.ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ప్రతి మహిళను కోటీశ్వరురాలిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రూ.27వేల కోట్ల రుణాలను సమకూర్చినట్లు వెల్లడించారు.

రుణాలను 98 శాతం రీపేమెంట్

మహిళలు బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాలను 98 శాతం రీపేమెంట్ చేస్తున్నారని, అందువల్ల బ్యాంకులు మరింత ఉత్సాహంగా సహకరిస్తున్నాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాలల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభ, వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, అదనపు సీఈవో కాత్యాయిని, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, వీహబ్ సీఈవో సీతా పల్లచోళ తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

ప్రతి మహిళ మహారాణి కావాలంటే ఆర్థిక స్వావలంబన అవసరం.. చేతిలో డబ్బు ఉన్నప్పుడే మహిళలకు స్వేచ్ఛ, గౌరవం లభిస్తుంది. కుటుంబాభివృద్ధి, పిల్లలకు మంచి విద్య అందించాలంటే మహిళలు ఆర్థికంగా బలపడాలని మంత్రి సీతక్క అన్నారు. కూకట్పల్లి దుర్గాబాయి మహిళా శిశువికాస మహిళా ప్రాంగణంలో మహిళా ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఉచిత శిక్షణతో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 Also Read: Sukumar Writings: సుకుమార్‌ రైటింగ్స్‌కు పది వసంతాలు.. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా?

గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్ల పై అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డి  సమీక్ష

మహాత్మ గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లకు అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) జి. ముకుంద రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అక్టోబర్ 2న లంగర్ హౌజ్ బాపూఘాట్ లో నిర్వహించే గాంధీ జయంతి వేడుకల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వచ్చేనెల అక్టోబర్ 2న గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిై, ఉన్నతాధికారులు బాపూ ఘాట్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పిస్తారని, ఆ తర్వాత మ్యూజియంను తిలకిస్తారని వెల్లడించారు.

సమన్వయంతో కలిసి నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలి

శాఖల వారీగా చేపట్టే ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో కలిసి నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఆయన సూచించారు. వేడుకల్లో నిరంతర విద్యుత్, పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి ఏర్పాటు, భారీ కేడింగ్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పూలతో చేపట్టే సుందరీకరణ పనులు, మెడికల్ స్టాల్స్ తో పాటు అంబులెన్స్ ఏర్పాటు, సౌండ్ ప్రూఫ్ జనరేటర్లు ఏర్పాటు, మీడియా పాయింట్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, వాటర్ ప్రూఫ్ షామియానాల ఏర్పాటు, ప్రోటోకాల్ అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. వెంకటి, ఆర్‌ అండ్‌ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫియాజ్, విద్యుత్, ఉద్యాన, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, ఫైర్, పోలీస్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Zubeen Garg death: స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రముఖ గాయకుడు మృతి.. ఏం జరిగింది అంటే?

Just In

01

CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పణ

DRDO Recruitment 2025: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Lord Hanuman: ఇక దేవుళ్ల వంతు.. హనుమంతుడిపై నోరు పారేసుకున్న ట్రంప్ పార్టీ నేత

Crime News: జోగిపేటలో దారుణం.. పండ్ల కోసం వెళ్లి యువకుడు మృతి

Bengaluru: భార్యపై అనుమానం.. కూతురు చూస్తుండగానే బస్టాప్‌లో చెప్పలేని దారుణానికి ఒడిగట్టిన భర్త