Minister Seethakka( image CREDIT : TWITTER)
తెలంగాణ

Minister Seethakka: అంగ‌న్వాడీల‌కు ఫుడ్ గ్యాప్ ఉండోద్దు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

Minister Seethakka: అంగన్ వాడీలకు పాలతో సహా ఎక్కడా ఫుడ్ గ్యాప్ లేకుండా చూడాలని మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సకాలంలో అందుతున్నాయా? లేదా అని ఆరా తీశారు. గుడ్లు, పాలు, పప్పు, మంచినూనె, స్నాక్స్, బాలమృతం సరఫరాపై సమీక్షించారు. పాలు మినహా మిగిలిన వస్తువులన్నీ 98 శాతం పైగా సరఫరా అవుతుండగా, పాలు మాత్రం గత నెలలో 58 శాతం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపారు.

 Also Read: Thummala Nageswara Rao: యూరియా పంపిణీలో ఇబ్బందులు రావొద్దు.. మంత్రి తుమ్మల ఆదేశాలు

ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలి

పాల సరఫరా లోపంపై మంత్రి సీరియస్‌గా స్పందించారు. 5 జిల్లాలు మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు టెండర్లు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం త్వరలో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 1261 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి లక్ష్యాన్ని నిర్ణయించగా, 1181 కేంద్రాలకు స్థలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నవంబర్ 19న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జయంతి లోపు భవనాల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నిర్మాణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని సూచించారు.

చిన్నారుల యూనిఫాంలు తక్షణం సరఫరా చేయాలి 

అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో బల్లలు, సిబ్బంది యూనిఫాంలు, చిన్నారుల యూనిఫాంలు తక్షణం సరఫరా చేయాలన్నారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థలతో మహిళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 19,20 తేదీల్లో మ‌హిళా భ‌ద్ర‌త పై చ‌ర్చించేందుకు రౌండ్ టెబుల్, మ‌హిళా స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన సిబ్బంది పాల్గొన్నారు. పనుల పురోగతిపై, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

 Also Read: Crime News: తండ్రిని హత్య చేసి.. డెడ్‌బాడీ పక్కన నిద్రపోయిన కొడుకు

Just In

01

PDSU Demands: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ యూ ధర్నా.. ఎక్కడంటే..?

Communist Parties: పునాది పై కామ్రేడ్ల కసరత్తు.. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?