తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ponnam Prabhakar : పార్టీని ప్రమోట్ చేయడంలో యూత్ కాంగ్రెస్ కీలకంగా మారాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కష్టపడ్డోళ్లకు పదవులు ఆటోమెటిక్ గా వెతుక్కుంటూ వస్తాయని వివరించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ తాను 30 ఏళ్లు పార్టీలో పుల్ టైమ్ గా పనిచేశానని వివరించారు. దీంతోనే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగానని వివరించారు. ఎంపీ నుంచి మంత్రి వరకు అవకాశాలు వచ్చాయన్నారు. పదవుల్లో ఎలాంటి పైరవీలు చెల్లవన్నారు.
క్షేత్రస్థాయిలో యూత్ కాంగ్రెస్ సమర్ధవంతంగా పనిచేసినప్పుడే, కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందన్నారు. నాయకులంతా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. గడిచిన పదేళ్లుగా నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశానన్నారు. పార్టీ కోసం శ్రమించినోళ్లకు అన్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సామాన్యులకూ పదవులు దక్కే ఛాన్స్ ఉంటుందన్నారు. ఇక ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జనాల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
Also Read: MLA K.R. Nagaraju: పేదింటి సన్న బియ్యం రుచిచూసిన ఎమ్మెల్యే కె.ఆర్
200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్, సన్న బియ్యం, సన్న వడ్లుకు బోనస్ వంటి ప్రయోజనాలను వివరించాలన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులంతా సైనికుల్లా వర్క్ చేయాలన్నారు. అపోజిషన్ అవాస్తవాలను సోషల్ మీడియాలోనే ప్రజలకు తెలిసేలా వ్యవహరించాలన్నారు. యూత్ కాంగ్రెస్ కోటాలోనూ ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు వస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ యూత్ కాంగ్రెస్ నేత ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను అడ్డుకట్ట వేయాలన్నారు.
ప్రభుత్వ స్కీమ్ లను వివరిస్తూనే, ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతాలపై ఆయా పార్టీల లీడర్లను నిలదీయాలన్నారు. ప్రధానంగా హెచ్ సీయూ భూములపై బీజేపీ, బీఆర్ ఎస్ చేస్తున్న వ్యవహారం మంచిది కాదన్నారు. అవాస్తవాలను నిజం అని నమ్మేలా ఆ రెండు పార్టీలు జనాల్లోకి తీసుకువెళ్లగలిగాయన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/