Ponguleti Srinivasa Reddy: రాష్ట్ర సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. సర్వే విభాగంను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో 5 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను అందుభాటులోకి తీసుకు రానున్నారు. సర్వేయర్ల శిక్షణకు ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రతి మండలం, పట్టణంలో భూ విస్తరణ, భూ లావాదేవీలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హత గలిగిన అభ్యర్థులనుండి ఈ నెల 17 వ తేది వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Also Read: CM Revanth Reddy: దేశమంతా ఒక్కటిగా నిలిచి ఉగ్రవాదాన్ని కూల్చేద్దాం.. సీఎం పిలుపు!
దరకాస్తు చేసుకోండి.
అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) ఒక అంశంగా ఉండి, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండి ఐటిఐ నుంచి డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉన్న వారు అర్హులని అన్నారు. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.10వేలు, బీసీ అభ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 చెల్లించవలసి ఉంటుందని, ఎంపిక అయిన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో 50 పని దినాలలో తెలంగాణ అకాడమీ (ల్యాండ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి, వీలైనంత త్వరగా లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
Also Read: Operation Sindoor: ఆసుపత్రులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. దవాఖాన్లకు ప్రత్యేక సింబల్స్!