Konda Surekha: అధికారులపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్షన్ లేకుండా దేవాలయానికి చెందిన మడిగెలను ఫ్రీగా ఎలా ఇస్తారని నిలదీశారు. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌ను ఎండోమెంట్ ఉన్నతాధికారులతో కలిసి గురువారం ఆకస్మికంగా మంత్రి సందర్శించారు. త్వరలో రేణుక ఎల్లమ్మ కళ్యాణం పురస్కరించుకొని పరిశీలించారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: TG on Panchayats: గ్రామ పంచాయతీల్లో 17 రకాల లక్ష్యాలు.. సక్సెస్ చేసేలా ప్రణాళికలు
దేవాలయం సమీపంలో అసంపూర్తిగా ఉన్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులపై మంత్రి అధికారులతో ఆరా తీశారు. అమ్మవారి కళ్యాణం, బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అమ్మవారి కళ్యాణం, బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, మడిగలకు సంబంధించిన వివరాలు అందజేయాలని ఆదేశించారు. ప్రసాదం క్వాలిటీ సహా వివరాలు అందజేయాలన్నారు. మడిగలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, కాంట్రాక్టు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Plane Crash: మాజీ సీఎం కన్నుమూత.. పొలిటికల్ హిస్టరీ పెద్దదే!