నల్లగొండ బ్యూరో స్వేచ్చ: Fine Rice distribution: సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని, చరిత్రలో నిలిచిపోనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కనగల్ మండలం జి .ఎడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో నాలుగు కోట్ల రూ.63 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు.
పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించామన్నారు. 3.10 కోట్ల మందికి సన్నబియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. కనగల్ మండలంలో 20 ఏండ్ల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలతో తాను 500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు.
కనగల్ మండలంలో 80 కోట్ల రూపాయలతో రోడ్ల పనులు చేపట్టామని, అన్ని గ్రామాలలో డ్రైన్లు, రోడ్లు వేయి స్తున్నామని, ప్రతి గ్రామంలో డ్రైన్లు వేశాకే రోడ్లు వేస్తున్నామని చెప్పారు. జి.ఎడవెళ్లి చెరువు అలుగు గండి మరమ్మతుకు కోటి 30 లక్షల రూపాయలను మంజూరు చేశామని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం అనే మరో అద్భుత పథకం తీసుకువచ్చిందని, ఈ పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందని తెలిపారు.
Also Read: Mega157: బ్లాక్ బస్టర్ మెషీన్ డ్యూటీ ఎక్కేశాడు.. రాబోయే సంక్రాంతికి రఫ్ఫాడించుడ
ఒక్కొక్కరికి రూ.నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉందని, అందువలన నిరుద్యోగ యువతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను ఇప్పటివరకు భర్తీ చేసిందని ,ఇందిరమ్మ ఇండ్ల కు పేదలను గుర్తించాలని ఆయన కోరారు. కనగల్ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగిందని ,పిల్లల్ని బాగా చ దివించాలని ,ఆరోగ్యంగా ఉండాలని, ఏడవల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈనెల 7న బక్కతాయికుంట, నర్సింగ్ బట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంత్రి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాక 28 లక్షల రూపాయలతో నిర్మించనున్న మూడు సిసి రోడ్లపనులకు, 3 కోట్ల45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 7 నూతన గ్రామీణ రహదారుల పనులకు, 70 లక్షల రూపాయలతో చేపట్టే ఒక రోడ్డు నిర్వహన పనులకు, మరో 20 లక్షల రూపాయల వ్యయంతో డిఎంఎఫ్టీ కింద చేపట్టనున్న ఒక పనికి శంకుస్థాపన చేశారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, అనూప్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎస్ఓ హరీష్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, డిసిఓ పత్యా నాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rooster Fight Organisers: కోడి పందాలు కలకలం.. ఆరుగురు అరెస్ట్.. ఎక్కడంటే?