Minister Komatireddy:పెండింగ్‌లో ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ములుగు, నారాయణపేట, కరీంనగర్ జిల్లాల సమీకృత కార్యాలయాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్‌లో ఆర్ అండ్ బీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
Also Read: BJP MP Kishan Reddy: బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం వెనుకబడింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!
పెండింగ్‌లో ఉన్న 5 జిల్లా సమీకృత కార్యాలయాల పురోగతిపై ఆరా తీయగా, పెండింగ్ బిల్లుల అంశాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి (Bhatti Vikramarka) భట్టి విక్రమార్కతో మాట్లాడి వర్క్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. మంచి రోడ్లు ఉంటే రవాణా సౌకర్యం పెరుగుతుందని, అది అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) వివరించారు.
ఒక్క గ్రేటర్ (Hyderabad) హైదరాబాద్‌లోనే 91 లక్షల వెహికిల్ మూవ్‌మెంట్ ఉందని, రూరల్ (Telangana) తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఉంటుందని, అందుకు మంచి రోడ్లు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలకు ప్రధానంగా కావాల్సింది సౌకర్యవంతమైన రోడ్లని గుర్తించి పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్‌సీ తిరుమల, చీఫ్ ఇంజినీర్లు మోహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Sridhar Rao Audio Leak: కలకలం రేపుతున్న.. సంధ్య శ్రీధర్ ఆడియో!