Minister Komatireddy (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Minister Komatireddy: టాలీవుడ్‌కు 7 నేషనల్ అవార్డ్స్.. ప్రభుత్వ స్పందన ఇదే!

Minister Komatireddy: 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు 7 అవార్డులు లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపిక కావడం, తెలంగాణలోని పల్లె ఆప్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన బలగం సినిమాలోని పాటలకు కాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డు లభించడం పట్ల మంత్రి వారికి అభినందనలు తెలిపారు.

Also Read: Donald Trump: రష్యాతో చమురు దోస్తీ కట్.. మోదీ చెప్పకముందే ట్రంప్ ప్రకటన!

బేబీ, హనుమాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు వచ్చాయన్నారు. గాంధీ తాత చెట్టు చిత్రానికి సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను చాటిచెప్తున్నది అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి సారి సినీ పరిశ్రమను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులతో సత్కరించి, ప్రోత్సాహానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ రంగాన్ని నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. అవార్డులు వరించిన చిత్రాలకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, అవార్డు వచ్చేలా సమష్టి కృషి చేసిన వారి బృందం మొత్తానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

Also Read This: R. Krishnaiah: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతుందా? ఆర్. కృష్ణయ్య రియాక్షన్ ఇదే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!