Excise Police Stations: రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్లు(Excise Police Stations) ఏర్పాటయ్యాయి. ఈనెల 28న ఎక్సయిజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishnarao) వీటిని ప్రారంభించనున్నారు. హైదరాబాద్(Hydrabad), రంగారెడ్డి(Ranga Reddy) డివిజన్లలో 12 స్టేషన్లు ప్రారంభం కానుండగా మెదక్(Medak), వరంగల్ డివిజన్లలో ఒక్కో స్టేషన్ అందుబాటులోకి రానున్నాయి. 2020లో ఈ కొత్త ఎక్సయిజ్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. వీటికి ప్రభుత్వ ఆమోదం లభించటంతో ఈనెల 28నుంచి కొత్త స్టేషన్లు పని చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఉన్న ఎక్సయిజ్స్టేషన్లలోనే ఏర్పాటు
దీని కోసం అద్దె భవనాలను గుర్తించాలని సూచించారు. ఈ క్రమంలో బంజారాహిల్స్, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్, పెద్ద అంబర్పేట, కూకట్పల్లి, అమీన్పూర్, హసన్పర్తి ఎక్సయిజ్ స్టేషన్ల కోసం అద్దె భవనాలను గుర్తించారు. మారేడ్ పల్లి, మీర్పేట, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ స్టేషన్లను ప్రస్తుతం ఉన్న ఎక్సయిజ్స్టేషన్లలోనే ఏర్పాటు చేయనున్నారు. పాత ఎక్సయిజ్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లే కొత్తవాటికి కూడా బాధ్యత వహిస్తారు. కొన్ని స్టేషన్లకు సీనియర్ ఎస్సైలను ఎస్హెచ్వోలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పని చేయనున్న స్టేషన్లకు కేసులు, స్వాధీనం చేసుకున్న సొత్తును బదలాయించనున్నారు.
Also Read: Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!
పరిధుల విభజన
కొత్త ఎక్సయిజ్స్టేషన్లు పని చేయనున్న నేపథ్యంలో పాత స్టేషన్ల పరిధులను విభజించి ఆయా ప్రాంతాలను వీటికి కేటాయించారు. సికింద్రాబాద్ ఎక్సయిజ్ స్టేషన్(Secunderabad Excise Station) పరిధిలో కొత్తగా మారేడ్పల్లి, చిక్కడపల్లి స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్స్టేషన్ పరిధిలో కొత్తగా గండిపేట, కొండాపూర్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. సరూర్నగర్స్టేషన్ పరిధిలో మీర్ పేట స్టేషన్ మొదలు కానుంది. మేడ్చల్(Medchel) స్టేషన్ను విభజించి కొంపల్లి, కూకట్ పల్లి(Kukat Pally) స్టేషన్లను ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి స్టేషన్ పరిధులను విభజించి కాప్రా, నాచారం, అల్వాల్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. సంగారెడ్డి(Sanga Reddy) ఎక్పయిజ్ స్టేషన్ పరిధులను విభజించి అమీన్పూర్, వరంగల్అర్భన్ ఎక్సయిజ్స్టేషన్ ను విభజించి హసన్పర్తి స్టేషన్ను ఏర్పాటు చేశారు.
Also Read: Bike Robbery: వాటికి బానిసై.. బైక్ దొంగలుగా మారిన యువకులు