తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : Jupally Krishna Rao: ప్రభుత్వంలోని కొందరు అధికారుల్లో అలసత్వం, నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నదని మంత్రి జూ పల్లి హాట్ కామెంట్స్ చేశారు. భయం, భక్తి వంటివి వారిలో లేవరన్నారు. రిపీటెడ్ గా ఆయా అధికారులపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ…క్యాబినెట్ విస్తరణలో శాఖల మార్పులు ఉండవచ్చన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే ఆస్కారం ఉన్నదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో మంత్రులంతా ప్రశాంతంగా పని చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశం లేదని గుర్తుచేశారు. పాలకుల్లో అహంభావం కనిపించిందన్నారు. మంత్రులూ అవమానాలకు గురయ్యారని స్పష్టం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి, అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. మరో వైపు హెచ్ సీయూ నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
Also Read: Khammam DSP: ఓటీపీ చెప్పారో.. అంతా గల్లంతే.. సైబర్ క్రైమ్ డిఎస్పీ ఫణింధర్
20 ఏళ్లుగా న్యాయ వివాదంలో ని భూముల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ ఎస్ ఫెయిలైందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు పరం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆ భూములపై ప్రత్యేక ఫోకస్ పెట్టారన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు కంచె భూములను టీజీ ఐసీసీకి అప్పగించారని, హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తరహాలో కంచె భూముల్లోనూ కంపెనీలు రానున్నాయని వివరించారు.తెలంగాణకు పెట్టుబడులు ,ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం తన శక్తి మేరకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
గత బీఆర్ ఎస్ పాలనలో రూ. 31 వేల కోట్ల విలువైన 453 ఎకరాల ప్రభుత్వభూములను అమ్మారని గుర్తు చేశారు. ఇప్పుడు అమ్మకాలు చేసి, ఇప్పుడు పెడబొబ్బలు దేనికి అంటూ ప్రశ్నించారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల భూములను బీఆర్ ఎస్ పార్టీకి కేటాయించుకున్నారని వెల్లడించారు. ఏ పార్టీకి రాని పండ్స్ బీఆర్ ఎస్ కు ఎలా వచ్చాయని నిలదీశారు.
ఇక ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ కంపనీలకు ధారదత్తం చేసిందన్నారు. ఇప్పుడు అదే బీజేపీ నేతలు తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ద్వజమెత్తారు. దేశంలో గత పదేళల్లో 16 లక్షల ఎకరాల అడవిని నాశనం చేసిన అధికార బీజేపీకి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు