Khammam DSP [ image credit: swetcha reporter
తెలంగాణ

Khammam DSP: ఓటీపీ చెప్పారో.. అంతా గల్లంతే.. సైబర్ క్రైమ్ డిఎస్పీ ఫణింధర్

ఖమ్మం స్వేచ్ఛ: Khammam DSP: ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలపై మరింత అప్రమత్తంగా వుండాలని సిహెచ్.ఆర్.వి. ఫణీందర్ అన్నారు.బుధవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిఏస్పీ మాట్లాడుతూ…నకిలీ యాప్ ల ద్వారా డబ్బు, డేటా దోచుకుంటారన్నారు. బెట్టింగ్ గేము ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేసి యూజర్ల గెలుపును ప్రోత్సాహిస్తారు, డబ్బు గెలిచినప్పటికీ ఉపసంహరించుకోవడానికి అనుమతించని మోసపూరిత నియమాలను విధించి, డబ్బు విత్ డ్రా చేసుకోలేకుండా చేస్తారని పెర్కొన్నారు.

వాట్సాప్ , ఇన్స్టాగ్రామ్, ఇమెయిల్ మరియు ఫేస్ బుక్ నకిలీ ఖాతాలు సృష్టించి, వాటి ద్వారా టిక్కెట్లు ఆఫర్ లో తక్కువకే యిస్తున్నట్లు నమ్మిస్తారు.ముందుగా కొంత డబ్బు తీసుకుని, ఇంకా కొంతమొత్తం కడితేనే టికెట్స్ ఇస్తాము లేకుంటే లేదని, చివరికి బ్లాక్ మేల్ చేస్తారని అన్నారు. నేరస్తులు మీ బాస్, CEO లేదా సహోద్యోగిలా నటించి, అత్యవసరంగా డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడిచేయడం లేదా సున్నితమైన కంపెనీ సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తారన్నారు.

బ్యాంక్/ఆర్థిక సంస్థ మోసం

బ్యాంక్ ప్రతినిధిగా వ్యవహరించి, ఖాతా వివరాలు, OTPలు లేదా ఇతర ఆర్థిక సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నిస్తారు. ప్రభుత్వ ఏజెన్సీ – ఆదాయ పన్ను శాఖ, పోలీస్ లేదా ఇతర అధికార సంస్థల ప్రతినిధిగా నటించి, జరిమానాలు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల పేరుతో మోసం చేస్తారు. ప్రసిద్ధ వ్యక్తులు లేదా సోషల్ మీడియా ప్రభావకులు ప్రమోట్ చేస్తున్నారని గుడ్డిగా నమ్మకుండా వారు చెప్పే ప్రకటనలను పరిశీలించి, బెట్టింగ్ ఆఫ్, మరియు ఆన్లైన్ బెట్టింగ్ విషయాలలోజాగ్రత్త వహించాలని సూచించారు.

Sudarshan Reddy: ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమేనా? ఇదే హాట్ టాపిక్ ఇక్కడ..

ఎల్లప్పుడు అధికారికమైన వెబ్సైట్లు లేదా అప్లికేషన్ల ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలన్నారు. IPL టికెట్ పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయకండి, APK లను డౌన్లోడ్ చేయకండి అని హితవు పలికారు.NCRP పోర్టల్ మరియు గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసారు, ఎవరైన సైబర్ క్రైమ్ భారీ పడితే 1930 కాల్ లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.ఈ కార్యక్రమములో , సైబర్ క్రైమ్ ఎస్. ఐ. రంజిత్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రసాద్, ప్రభుత్య వైద్య కళాశాల ఖమ్మం ప్రిన్స్ పాల్ డా: రాజేశ్వరావ్ డా :సరిత కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?