Shakti Abhiyan: శక్తి అభియాన్ నేషనల్ అడ్వైజర్ డాక్టర్. సల్ల సౌజన్య మరియు సిఎస్ శివలాల్ నీతికర్ నేషనల్ కోఆర్డినేటర్ లు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు జనాభా ప్రతిపాదినిక వనరులలో, విద్యలో, ఉద్యోగాలలో , అవకాశాలల్లో మరియు చట్టసభల్లో వారికి కావలసిన 50 శాతం హక్కులకోసం పోరాటం చేయడానికి ఏర్పడింది ఈ శక్తి అభియాన్ అని మీనాక్షినటరాజన్ అన్నారు.
ఈ శక్తి అభియాన్ మహిళలు వారి నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల పైన, సమాజంలో పాతుకుపోయిన వివక్ష పైన పోరాడడానికి ఒక వేదికగా ఉంటుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమం మహిళల యొక్క హక్కులు, జనాభా ప్రతిపాదన రావలసిన వాటాలు మరియు వారికి రావలసిన గుర్తింపు అనే ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది.
లోక్ సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ మహిళల పట్ల ఉన్నతమైన ఆలోచన విధానంతో, ఎంతో మేదో మధనం చేసిన తర్వాత భారత రాజకీయ వ్యవస్థలు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడం కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ శక్తి అభియాన్ ప్రతిష్టాత్మకంగా స్థాపించారు అని అన్నారు.
Also Read: Ex MLA Shakeel Aamir: అవినీతి ఆరోపణలు.. నోరు విప్పిన ఆ మాజీ ఎమ్మెల్యే!
ఈ కార్యక్రమం మొదలైన 18 నెలల్లోని దేశం మొత్తంలో 5000 పైగా శక్తి క్లబ్స్ నిర్మించి 31,000 మంది సభ్యులతో కూడిన నెట్వర్క్ ను తయారు చేశారు. అదేవిధంగా తెలంగాణలో 145 క్లబ్స్ ను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసి వారికి రాజకీయంగా, సామాజికంగా అవగాహన సదస్సులు మరియు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
సమకాలిన గాడి తప్పిన రాజకీయ వ్యవస్థను మార్చాలన్న, రాజకీయ వ్యవస్థలో హింసను దూరం చేయాలన్న మహిళల యొక్క ఆలోచన అన్నింటా వారి భాగస్వామ్యం ఎంతో అవసరం అని మేము మా నాయకులు తెలియజేస్తున్నామని మీనాక్షి నటరాజన్ అన్నారు.
అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల వారిగా ఈ యొక్క శక్తి అభియాన్ ప్రారంవుంచాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను అని ఆమే తెలియజేశారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/