Kaushik Reddy Arrest (Image Source; Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Kaushik Reddy Arrest: ఆస్పత్రిలో కౌశిక్ రెడ్డి.. బయట రచ్చ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు!

Kaushik Reddy Arrest: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్‌ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుబేదారీ పోలీస్‌స్టేషన్‌ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం అతడిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే వాహనం దిగిన వెంటనే ఆయన పర్సంటేజీల ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డా.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు.

Also Read: Aamir Khan – Gauri Spratt: అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఇద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!

పరీక్షల అనంతరం ఎంజీఎం వైద్యులు పోలీసులకు రిపోర్టులు అందజేయడంతో పోలీసులు కౌశిక్‌ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే కౌశిక్ రెడ్డి రాక గురించి తెలుసుకున్న పోలీసులు భారీగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం కాజీపేటలోని రైల్వే కోర్టుకు తరలిస్తుండగా.. పోలీసు కాన్వాయ్ ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఆందోళనకు దిగిన పలువురు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read This: Nalgonda Crime: మహిళతో ఎఫైర్.. చెట్టుకు కట్టేసి.. కళ్లల్లో కారం కొట్టి.. యువకుడి హత్య! 

హనుమకొండ జిల్లా కమలాపురం మండల పరిధిలోని వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారిని కౌశిక్ రెడ్డి బెదిరించారు. దీనికి సంబంధించి బాధిత వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి సుబేదారి పోలీసులను ఆశ్రయించారు. కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కాదని వ్యాపారం చేసుకోలేరని డబ్బులు ఇవ్వాల్సిందేనని లేదంటే చంపేస్తానని భయపెట్టారని ఆమె పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!