manda-krishna
తెలంగాణ

SC Classification: సర్కారును ఢిపెన్స్ లోకి నెడుతున్న మందకృష్ణ!

SC Classification: ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు అనుకూలంగా ఉన్నాం అంటున్న సీఎం రేవంత్(CM Revanth Reddy)… మాలల సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే పనిలో సీఎం నిమగ్నమయ్యారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ(Assembly) సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి జిల్లాల్లోని వర్సిటీల్లో నిరవధిక దీక్షలకు దిగుతామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చాకే రాష్ట్రంలో ఉద్యోగాలను భార్తీ చేయాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈమేరకు ఇవాళ నిర్వహించిన పత్రిక విలేకర్ల సమావేశలో మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.

కాగా, నిన్న(శనివారం) సీఎం రేవంత్ రెడ్డికి మంద కృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ అంశం చట్టం రూపం తీసుకునే వరకు రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ నియామక(Exam Notifications) పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, అంతలోనే గ్రూప్స్ ఫలితాల(Groups Results) వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదని ఆక్షేపించారు. ఇలాంటి చర్యల వల్ల ఎస్సీ(SC)లకు మళ్లీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే… తాజాగా మందకృష్ణ మదిగ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పదే పదే నొక్కి వక్కాణిస్తున్నారు.  మూడు రోజుల క్రితం.. 6వ తేదీన జరిగిన కెేబినెట్ మీటింగ్ లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఆ సమావేశంలో మంత్రివర్గం(Cabinet) ఆమోదించిన బిల్లుల్లో ఇది కూడా ఉంది. అందులో భాగంగానే ఈనెల 12వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అయితే మందకృష్ణ చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడెెేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం  ముందే గ్రూపు ఫలితాలు వెల్లడించినట్లయితే… మాదిగలు నొచ్చుకునే ప్రమాదం ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎంతో కొంత ఉండకుండా ఉండదు. మరోవైపు ఇప్పటికే కులగణన(Cast Census) మీద పలు నిరసనలు కొనసాగుతున్నాయి. బీసీ(Bc) నినాదం అంతకంతకూ పెరుగుతున్నది. మంత్రి పదవుల్లో మాకు అన్యాయం జరిగింది… కార్పొరేషన్ పదవుల్లో కుట్ర జరిగింది అంటూ నినదిస్తున్న పలువురు అసమ్మతి నేతలు, బహిషృత నేతలు…ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో చూస్తాం అంటూ ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఇన్ని వివాదాల మధ్య ఇప్పడు ఈ కొత్త సమస్య సర్కారును చుట్టుముట్టనుందా అని కాంగ్రెస్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో … ముఖ్యమంత్రి గారిది మాలలను ప్రసన్నం చేసుకునే వ్యూహం అయి ఉండొచ్చు కదా! అని సమర్థిస్తున్నారు. ఎందుకంటే… ఇప్పటికే ఎస్సీ వర్గీకరణలో భాగంగా మూడు గ్రూపులుగా విభజించిన ఏకసభ్య కమిషన్… మాలలను మూడో గ్రూపులో అంటే మెరుగైన వారి జాబితాలో చేర్చింది. మరి.. అలాంటప్పుడు మాలలను కూడా బుజ్జగించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా! బహుశా రేవంత్ అందుకే గ్రూప్స్ ఫలితాలను త్వరలో వెల్లడించాలనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఎంటంటే… గ్రూప్1 పరీక్ష ముందు కూడా జీవో విషయంలో ఇలాగే ఆరోపణలు వచ్చిన ఆందోళనలు జరిగిన సీఎం వెనక్కి తగ్గలేదు.

Also Read: 

SLBC Rescue: ఎస్ఎల్బీసీ రెస్క్యూలో బిగ్ బ్రేక్ త్రూ… మనిషి చెయ్యిని గుర్తించిన జాగిలాలు

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?