kerala-dogs
తెలంగాణ

SLBC Rescue: ఎస్ఎల్బీసీ రెస్క్యూలో బిగ్ బ్రేక్ త్రూ… మనిషి చెయ్యిని గుర్తించిన జాగిలాలు

SLBC Rescue:  ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌(SLBC Tunnel) వద్ద సహాయక చర్యల్లో ఎట్టకేలకు బిగ్ బ్రేక త్రూ(Break Through) లభించింది. ప్రమాదం జరిగిన  ఏరియాలో మనుషుల ఆనవాళ్లు(Human Remains) బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనిషి చెయ్యిని(Human Hand) కేరళ జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిబ్బంది(Rescue Team) జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెస్యూ ఆపరేషన్స్(Rescue Operations) లో మరింత పురోగతి కనిపించనుంది.

నాగర్‌కర్నూల్‌(Nagar kurnool) జిల్లాలోని దోమలపెంట(Domalapenta) సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకాలు జరుగుతుండగా టన్నెల్ పై కప్పు కూలి ఎనిమిది మంది గల్లంతయిన సంగతి తెలిసిందే. ఫిభ్రవరి 22న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి వారిని బయటకు తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు. కానీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒక్కొక్క కష్టాన్ని దాటుతూ 16 రోజులుగా వందల మంది సిబ్బంది శ్రమిస్తున్నారు. తొలుత ఇది ఇంత ప్రమాదమని ఎవ్వరూ భావించలేదు. ఎందుకంటే… ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 40 మంది దాకా సిబ్బంది టన్నెల్ లో ఉన్నారు. 14వ కి.మీ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా… సరిగ్గా అక్కడ ఉన్నవాళ్లే ఇరుక్కుపోయారు. టన్నెల్ ముందు భాగంలో ఉండటంతో మిగతా 32 మంది బయటపడగలిగారు.

తొలుత అంతమంది బయటపడటంతో… మిగతా వాళ్లు కూడా క్షేమంగానే వస్తారులే అని అందరూ భావించారు. వాళ్లు ప్రాణాలతోనే తిరిగొస్తారని ఆశ పడ్డారు. కానీ ఘడియ ఘడియకు ఓ అడ్డంకి వచ్చి పడుతుండటంతో నాలుగు రోజుల తర్వాత ఆశలు వదులుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఏన్డీఆర్ఎఫ్(NDRF), మిలిటరీ(Army), ఇతర కేంద్ర బృందాలు పక్షం రోజులుగా సహాయక చర్యలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ కూలపోయినందు వల్ల లోపలికి ప్రవేశించడానికి అడ్డంగా మారాయని చెప్పారు. తర్వాత లోపల పెద్ద ఎత్తున బురద మేటలు కట్టిందని చెప్పారు. ఆ తర్వాత వీపరీతంగా నీరు ఊరుతుందని వెల్లడించారు. ఇలా ఒక్కో రోజు, ఒక్కో దశలో ఎన్నో సమస్యలు వచ్చిపడ్డాయి. చివరికి రోబోలను కూడా రంగంలోకి దించడానికి సిద్దపడ్డారు.

ఇటీవల కన్వేయర్ బెల్టు(Conveyor Belt) పాడవడంతో పనులకు తీవ్ర ఆటంకం కలిగినందున ఇటీవల దాన్ని పునరుద్ధరించారు. అయినా కష్టతరంగానే ఉండటంతో హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీతో రోబోలను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఎట్టకేలకు కేరళ నుంచి తీసుకొచ్చిన జాగిలాలు మనిషి ఆనవాళ్లను గు ర్తిచగలిగాయి.

ప్రమాదం జరిగిన 14వ కి.మీ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనిషి చెయ్యిని కేరళ జాగిలాలు(Kerala dogs) గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ తవ్వకాలు చేపట్టిన కార్మికులకు 6 అడుగుల లోతులో ఓ వ్యక్తికి చెందిన కుడి చేయి కనిపించింది. దాంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. చుట్టూ రెండు అడుగుల మేర మరో ఆరడుగుల లోతులో గొయ్యి తవ్వేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే మరో మృతదేహం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!