Laxman on Ayodhya(image credit: swetcha reporter)
తెలంగాణ

Laxman on Ayodhya: అయోధ్యలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Laxman on Ayodhya: అయోధ్య, కాశీకి తెలుగు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోందని, ఈనేపథ్యంలో తెలుగు భక్తుల సౌకర్యార్థం వసతి, పార్కింగ్ వంటి నిర్మాణాలకు భూమి కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కోరారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బుధవారం విజ్ఞప్తిచేశారు. భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉందన్నారు.

 Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్ భద్రతపై.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కీలక ప్రకటన!

అందుకే కనీసం 2000 చదరపు గజాల నుంచి 1 ఎకరం వరకు భూమిని కేటాయించాలని లక్ష్మణ్ కోరారు. భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా లేదా ఇతర సంబంధిత నిధుల సహాయంతో చేపడతానని సీఎం యోగికి వివరించారు. కాగా ఈ అంశంపై ముఖ్యమంత్రి యోగి సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. ఇదిలా ఉండగా తొలుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను.. లక్ష్​మణ్ మెమొంటో, శాలువాతో సత్కరించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!