Jobs in Telangana: తెలంగాణలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల కానుందని ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Medchal: మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు..
దీంతో 1284 ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician) గ్రేడ్ 2 పోస్టులు భర్తీ కానున్నాయి. సెప్టెంబర్ 11, 2024న నోటిఫికేషన్ ఇవ్వగా.. నవంబర్ 10, 2024న సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించారు. 24,045 మంది అభ్యర్థులుండగా.. ఇందులో 4194 మంది ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలోని హాస్పిటల్స్, సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరి కాంట్రాక్ట్ సర్టిఫికెట్స్‌ను వెరిఫికేషన్ చేసినట్లు మెడికల్ బోర్డు పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌లోనే అభ్యర్థుల లిస్టును ప్రకటించగా.. సుమారు 550 అబ్జక్షన్స్ వచ్చాయి. దీంతో అవన్నీ వెరిఫికేషన్ చేసి ఆగస్టు 6న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు చివరి నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్, సెలక్షన్స్ పూర్తవుతాయని బోర్డు పర్కొన్నది.
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు..
ఈ వారంలోనే నర్సింగ్ ఆఫీస్స్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖలో 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి. సెప్టెంబర్ 18, 2024న నోటిఫికేషన్ ఇవ్వగా, నవంబర్ 23, 2024న ఎగ్జామ్ నిర్వహించింది. ఏకంగా 42,244 మంది అభ్యర్ధులు సీబీటీ విధానంలో పరీక్ష రాశారు. ఇందులో 9582 మంది కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నట్లు సర్టిఫికేట్లు పొందుపరిచారు. ఆగస్టు 8న ఈ లిస్టును విడుదల చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబరు వరకు ఈ ప్రాసెస్ పూర్తి కానున్నది.
ఇతర పోస్టుల వివరాలు..
732 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుది. హైకోర్టులో పిటిషన్ ఉన్నందున ప్రొవిజనల్ లిస్ట్ ఆలస్యమవుతుందని, కోర్టు ఆదేశాల అనంతరం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు గానూ, ఆగస్టు 20న అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయనున్నారు. నవంబర్ లోపు నియామకాలు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
Also Read: Gadwal News: ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలైనా.. ఇప్పటికీ రాని భారీ వర్షాలు