KTR: కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం లేక కేసులతో డ్రామాలు: కేటీఆర్
KTR (imagecredit:twitter)
Political News, Telangana News

KTR: కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం లేక కేసులతో డ్రామాలు: కేటీఆర్

KTR: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఈ ప్రాంత రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్(KCR) సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆరు గ్యారంటీలు, రైతుబంధు వంటి హామీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెర వెనుక లీకులు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నోటీసులు, కేసులు డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ ఎస్ సర్పంచ్ లు, వార్డు మెంబర్ల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వారిని సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేసులు, బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శిఖండి పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు.

జలాలపై అవగాహన లేదు

కృష్ణానది జలాల కేటాయింపు వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు కనీస అవగాహన లేదన్నారు. పాలమూరు_రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తికాగా మిగిలిన 10 శాతం పనులు కంప్లీట్ చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కాలయాపన చేస్తోందన్నారు. డీపీ ఆర్ పంపటంలో విఫలమై ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు ప్రభుత్వం గండి కొడుతుందని మండిపడ్డారు. నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు న్యాయం జరిగే వరకు టిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

Also Read: Madhuri Struggles: కెరీర్ ప్రారంభంలో అలాంటివి చాలా ఎదుర్కొన్నా.. మాధురీ దీక్షిత్

ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదు

కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలతో పాటు రైతుబంధును అమలు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి సహకార ఎన్నికలను నిర్వహించేందుకు భయపడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సహకార ఎన్నికల్లో రైతులు కర్రు కాల్చి వాత పెడతారని ముందే గ్రహించి నామినేటెడ్ ప్రక్రియకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసిందని నమ్మితే రైతులపై భరోసా ఉంటే దమ్ముంటే సహకార ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కాలక్షేపం రాజకీయాలు మానేసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలి

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలపై అంతరం పోరాడాలని కేటీ ఆర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా మహబూబ్ నగర్,నలగొండ రైతులకు న్యాయం జరిగే పోరాటం చేయాలని కోరారు. జిల్లా మంత్రులు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్లభూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీందర్ కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహారెడ్డి, నల్లమోతు సిద్ధార్థ తదితరులు ఉన్నారు.

Also Read: Jishnu Dev Varma: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ద‌ర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ!

Just In

01

Realme Buds Air 8 India: రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 లాంచ్ డేట్ కన్ఫర్మ్

Baahubali Netflix: ఓటీటీలోకి రాబోతున్న ‘బాహుబలి: ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Varanasi Movie: కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘వారణాసి’.. ప్రకాష్ రాజ్ ఎం అన్నారంటే?

Kishan Reddy: అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ఆయన పాత్ర ఉంది: కిషన్ రెడ్డి

Deputy Sarpanch Powers: ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!