KTR
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

KTR: కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ.. విషయం ఏంటంటే

KTR: చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి

అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపైనా కూడా
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపైనా పన్నులు తగ్గించాలి
సెస్‌లు పూర్తిగా ఎత్తివేసి చిత్తశుద్ధి నిరూపించుకోండి
కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ బహిరంగ లేఖ రాశారు. అన్ని జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై, విద్యకు సంబంధిత ఫీజులపై విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ప్రజలను దోచుకుంటున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కూడా పన్నులను తక్షణమే తగ్గించి సెస్‌లను పూర్తిగా ఎత్తివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 12 శాతం స్లాబ్ రద్దు వంటి కంటితుడుపు చర్యలు ఆపి, నిత్యావసర వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తనకు అలవాటైన ‘జుమ్లా’లను పక్కనపెట్టి, ధరలు తగ్గించడంపై చిత్తశుద్ధిని ప్రదర్శించాలని అన్నారు. బీఆర్ఎస్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు కోసం గట్టిగా పట్టుబట్టాలని విజ్ఞప్తి చేశారు.

Read Also- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’‌లో కులశేఖరగా ఆ నటుడు.. ఫస్ట్ లుక్ విడుదల

పెట్రో, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ స్లాబ్ రద్దు అంటూ ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. దానితో ప్రజల జీవితాలు బాగుపడతాయని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ప్రతినెలా పేద, మధ్యతరగతి ప్రజల నుంచి వేల రూపాయలను కొల్లగొట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ స్లాబ్ రద్ తో వారికి కలిగే నామమాత్రపు ప్రయోజనాన్ని కూడా తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజంగా ప్రజలకు గరిష్ఠ ప్రయోజనం కలిగించాలని కేంద్రం భావిస్తే, తక్షణమే పెట్రో, ఎల్పీజీ రేట్లను తగ్గించి, సెస్‌లను పూర్తిగా ఎత్తివేయాలన్నారు. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ధరలు తగ్గించి, దేశ ప్రజలకు ‘అసలైన దీపావళి’ని అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటలపై చిత్తశుద్ధి ఉంటే, ధరల మంటకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడే మీరు పెంచిన ధరలు తగ్గి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

Read Also- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!

రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు
ఎస్ఎల్బీసీ టన్నెల్ తొవ్వడం చేతకాదు, సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు, చివరికి ఓ చెక్ డ్యామ్‌ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ 2 నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలన్నారు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?