KTR (imagecredit:swetcha)
తెలంగాణ

KTR: మెడికల్ డివైస్ పార్క్ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం: కేటీఆర్

KTR: ‘సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం.. దాని వల్ల వ్యర్థం’ అని కేసీఆర్(KCR) తమకు ఎప్పుడూ చెప్తుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. సాంకేతికత (టెక్నాలజీ) ఉన్నా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని పునరుద్ఘాటించారు.‘మీరు.. మేము కలిసి హైదరాబాద్‌(Hyderabad)ని, తెలంగాణా(Telangana)ని, భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. మరో రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం.. వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం అని స్పష్టం చేశారు.

ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం

సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌(Sultanpur Medical Devices Park)లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మాట్లాడుతూ దేశంలో 70, 8 నుంచి 80% మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అలా ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు?” అనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి, సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Reada: Missing Flight: ఆకాశంలో మాయమైన విమానం.. 35 ఏళ్ల తర్వాత ల్యాండింగ్?

కోవిడ్ సమయంలో..

పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్‌పూర్ ఏరియాలో స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మంది పని చేస్తుండటం, అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించిందన్నారు. ఇక్కడ జరిగిన పరిశోధనలు, ప్రవేశపెట్టిన ఉత్పత్తులు చూస్తే తనకు విశ్వాసం కలిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు, కోవిడ్ కిట్స్‌కు విపరీతమైన గిరాకీ, డిమాండ్ ఉండేదని, ఆ రోజుల్లో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నాశారు. కానీ హ్యూవెల్ సంస్థ పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ వంటి ఉత్పత్తుల ద్వారా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే పరిశోధనలు, కార్యక్రమాలు చేస్తున్నందుకు హ్యూవెల్ బృందాన్ని అభినందించారు.

Also Read: No 1 Place: టాలీవుడ్‌లో ఇక నెంబర్ వన్ హీరో, హీరోయిన్ ఉండరా? ఇప్పుడిదే ట్రెండ్!

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?