KTR: ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనందరం ప్రతినబూనుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపు నిచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకొని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బ్రతికేలా వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు.
Also Read: KTR: కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనం ఆమోదానికి సంకేతం : కేటీఆర్
ప్రభుత్వ ఉద్యోగాలలో 3% నుంచి 4% శాతం రిజర్వేషన్
కేసీఆర్ ఆనాడు మానవత్వంతో కూడిన పరిపాలన అందించారన్నారు. దివ్యాంగులకు అత్యధికంగా రూ.4016 పెన్షన్ ఇవ్వడంతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక ఆసరా పెన్షన్ ద్వారానే దాదాపు రూ.10వేల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 3% నుంచి 4% శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నామన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా అనేకమందికి సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
కానీ, అధికారం కోసం దివ్యాంగులకు రూ.6 వేల ఫించను, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, బాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ లాంటివి ఆశ చూపి రెండేళ్లు అవుతున్నా దానిని అమలు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం నినదిస్తుందని, సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తుందని భరోసా ఇస్తున్నామన్నారు.
Also Read: KTR Vs Congress: నీకు లాగు లేనప్పుడే మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాలు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్లు
కేటీఆర్‌తో మారిషస్ మంత్రి భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత అంతర్జాతీయ వాణిజ్య శాఖ సహాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ మర్యాదపూర్వక కలిశారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి, అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. భవిష్యత్తులో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులు, పరస్పర సహకారం వంటి అంశాలపై కూడా వారి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకుంటూ, మారిషస్ మంత్రిని కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

