KTR: గల్ఫ్‌లో తెలంగాణ వాసికి కేటీఆర్ భరోసా.
KTR (imagecredit:swetcha)
Telangana News

KTR: గల్ఫ్‌లో తెలంగాణ వాసికి భరోసా.. దైర్యం చెప్పిన కేటీఆర్!

KTR: జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లిన మండేపల్లి గ్రామానికి చెందిన మహేష్, కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం జుబెయిల్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డబ్బులు లేక సరైన వైద్యం అందక, మహేష్ పరిస్థితి విషమంగా మారుతుండగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్ల నియోజకవర్గం మండేపల్లిలోని మహేష్ ఇంటికి వెళ్లారు. కుటుంబానికి భరోసా ఇచ్చారు.

మహేష్‌కు అండగా ఉంటానని, బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. సౌదీలో చికిత్స పొందుతున్న మహేష్‌తో వీడియో కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. అధైర్యపడొద్దు నాలుగు ఐదు రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను అని భరోసా ఇచ్చారు. వెంటనే సౌదీలో ఉన్న పార్టీ ప్రతినిధులు, తెలిసిన వారిని జుబెయిల్ ఆసుపత్రికి పంపించి మహేష్‌కు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Also Read: Ponguleti On KCR: కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సంచలన కామెంట్స్!

అంత తీవ్ర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహేష్ ధైర్యంగా ఉండాలని, “నీ కుటుంబం కోసం బలంగా ఉండాలి” అని కేటీఆర్ సూచించారు. మహేష్ చికిత్సకు అవసరమైన వైద్య ఖర్చులు, విమాన ప్రయాణ ఖర్చులు తానే భరిస్తానని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలిపారు.

సౌదీలో ఉన్న పార్టీ ప్రతినిధులు, పరిచయాలు ఉన్న వారిని వెంటనే మహేష్ వద్దకు పంపించారు. ఆయనకు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. మంద మహేష్ స్వస్థలానికి వచ్చే ప్రక్రియలో అవసరమైన అధికారిక కార్యక్రమాల సమన్వయం కోసం తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, విదేశాంగ శాఖ అధికారులకు లేఖ రాశారు.

Also Read: Excise Department: రూ. 4 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత.. ఎక్కడంటే?

 

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క