Bharat Summit 2025: జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆమె భారత్ సమ్మిట్ లో మాట్లాడుతూ…వాతావరణంలో సమతూల్యత ఏర్పడాలంటే జీవన శైలీలో మార్పులు రావాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. పరిష్కార మార్గాలు ప్రజల చేతుల్లోనే ఉన్నా, నిర్లక్ష్యం ప్రస్పూటంగా కనిపిస్తుందన్నారు.
Alo Read: Rahul Gandhi Speech: పాత తరానికి వీడ్కోలు, కొత్త నాయకత్వానికి స్వాగతం.. రాహుల్ గాంధీ!
అస్థిర వర్షపాతం, రికార్డు స్థాయిలో వేడిగాలులు, వరదలు, జీవవైవిధ్యం కోల్పోవడం వంటివి కామన్ గా జరుగుతున్నాయన్నారు. గతంలో అర్బన్ లో ఉండే ఈ సమస్యలు ఇప్పుడు పల్లెల్లోనూ కనిపించడం బాధాకరమన్నారు. రైతులు,గిరిజనులు, మహిళలు, పిల్లలు, పట్టణ మురికివాడల నివాసితులు కార్బన్ ఉద్గారాలకు ప్రభావానికి గురికావాల్సి వస్తుందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో వన మహోత్సవం పేరిట పచ్చదనం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 273 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు. వాతావరణ న్యాయాన్ని వేగవంతం చేయడం కోసం ప్రభుత్వంతో విద్యావేత్తలు, పరిశ్రమలు, యువత, పౌర సమాజం కలిసి రావాలని కోరారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు