Konda Murali (imagecredit:twitter)
తెలంగాణ

Konda Murali: కొండా దంపతులను వెంటాడుతున్న వరుస వివాదాలు

Konda Murali: కొండ మురళి(Konda Murali) వ్యాఖ్యలతో ఒక వైపు స్వంత పార్టీలో తీవ్రస్థాయిలో వివాదం జరుగుతుండగా మరోవైపు బయటి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొండా దంపతులను ఇంటా బయట వరుస వివాదాలు చుట్టుముట్టాయి. ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు పెట్టామని కొండా మురళి చేసిన బహిరంగ వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. 2023 ఎన్నికల్లో కొండ సురేఖ(konda Surekha) ప్రత్యర్థులు ఆయన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు(Pradeep Rao), బిఆర్ఎస్(BRS) అభ్యర్థి నన్నపనేని నరేందర్‌(Narendar)లు వేర్వేరుగా ఎన్నికల కమిషన్‌(Election Commission)కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రూ.70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచాం అని కొండ మురళి బహిరంగగానే చెప్పారు.

ఎన్నికల కమీషన్ విచారణ

ఆ అంశంపై విచారణ చేపట్టి కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వారు చేసిన ఫిర్యాదుకు కొండ మురళి బహిరంగంగా మాట్లాడిన వీడియో(Video Clip) క్లిప్ జతచేసి రాష్ట్ర ఉప ప్రధాన ఎన్నికల అధికారి హరిసింగ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎన్నికల కమీషన్ విచారణ జరిపి కొండా సురేఖ(Konda Surekha) ఎన్నికను రద్దు చేయాలని వారు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేసారు. 16 ఎకరాలు ఎక్కడి భూమి అమ్మారు 70 కోట్ల రూపాయలు ఏ రూపంలో వచ్చాయో వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: Raja Singh resigned: రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం.. పలువురు నేతల ప్రశ్నలు

వాట్సాప్‌ ద్వారా గతంలో ఫిర్యాదు

కొండా దంపతుల తీరును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్‌(Warangal News) జిల్లాకు చెందిన కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్యేలు కొంతమంది హైదరాబాద్‌లో ఏఐసీసీ(AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌(Meenakshi Natarajan)కు, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవి(Mallu Ravi) ఇద్దరికి వేరు వేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌(Mahesh Kumar Goud) అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సమాచారం అందించి, వాట్సాప్‌ ద్వారా గతంలో ఫిర్యాదు చేశారు. గతంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి(MLA Prakash Reddy) మధ్య జరిగిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో మంత్రి ఎస్‌హెచ్‌వో(SHO) సీట్లో కూర్చున్న విషయాలను ప్రధానంగా మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వారిని కట్టడి చేయకపోతే రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని గతంలో కొంతమంది సాయకుల అన్నారు. పార్టీలో వారు ఉండాలా? లేదంటే మేము ఉండాలో చెప్పండి’’ అని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Also Read: PM Modi: డిజిటల్ ఇండియాకు పదేళ్లు.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు