Komatireddy Venkatreddy: దళిత సీఎం, పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్..ఆ హామీలను ఎందుకు అమలు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఇది మాట తప్పడమే కాదా? అంటూ నిలదీశారు. మాట తప్పితే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్, ఇలా ఎన్ని సార్లు నరుక్కోవస్తుందో? లెక్క పెట్టుకోవాలని చురకలు అంటించారు. శనివారం ఆయన అసెంబ్లీ లోని తన ఛాంబర్ లో చిట్ చాట్ చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు మోస పూరిత మాటలతో పబ్బం గడిపిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలకు లెక్కే లేదన్నారు.
ప్రజలను మోసం చేసినందుకు, ముఖ్యంగా దళితులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆయన రాజకీయ జీవితం ఇక క్లోజ్ అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులెవ్వరికీ పవర్స్ లేవన్నారు. కేవలం కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి మాత్రమేనని వివరించారు. ప్రస్తుతం హరీష్ రావు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమేనని, తాను మంత్రిని అని కోమటిరెడ్డి గుర్తు చేశారు. హరీష్ రావు మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన, స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: Bandi Sanjay – Raja Singh: రాజా సింగ్ vs బండి సంజయ్.. అధ్యక్ష పీఠంపై డైలాగ్ వార్!
ఇక ప్రశాంత్ రెడ్డి మంత్రిగా కంటే హోమాలు, పూజలు ఏర్పాట్లలో బీజీగా ఉండేవారని వివరించారన్నారు.కేసీఆర్ చేసే పూజలకు దగ్గరుండి ఏర్పాట్లు చేసేవాడన్నారు. ఇక సినినటుడు బాలకృష్ణపై మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్ లు చేశారు. బాలకృష్ణ కంటే తనతోనే ఎక్కువ మంది ఫోటోలు దిగుతారని, కానీ ఆయన సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.