Bandi Sanjay – Raja Singh: రాష్ట్ర అధ్యక్షుడి(State President) ఎంపికపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతల మధ్య డైలాగ్ వార్(Dialogue War) నడుస్తోంది. శనివారం ఉదయం రాజాసింగ్(Raja singh) హాట్ కామెంట్స్ చేయగా దానిపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్ర నాయకత్వం ఎంపిక చేస్తే కాబోయే అధ్యక్షుడు రబ్బర్ స్టాంపే(Rubber Stamp) అవుతాడని తొలుత రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలని అప్పుడే సమర్థుడైన నాయకుడు అధ్యక్షుడు కాగలడన్నారు. విషయమంతా.. ఎవరు ఎంపిక చేస్తారనే దానిపైనే ఆధారపడి ఉందని కుండ బద్దలు కొట్టారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేస్తే ఒకలా ఉంటుందని కేంద్ర కమిటీ ఎంపిక చేస్తే మరోలా ఫలితం ఉంటుందని రాజాసింగ్ డెరెక్ట్ అటాక్ చేశారు. గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేస్తున్న రాజాసింగ్ ఈవిధంగా కామెంట్స్ చేశారు.
Raja Singh: రబ్బర్ స్టాంప్ వస్తున్నాడు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
నేను రేసులో లేను..
అనంతరం, అదే అధ్యక్ష పీఠం అశంపై స్పందించిన బండి సంజయ్.. తాను అధ్యక్ష పదవిలో లేనని తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో హోంశాఖలో కలిసి పనిచేస్తున్నాని, రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించడం లేదని వివరణ ఇచ్చారు. అయితే.. పార్టీ ఎవరిని నిర్ణయిస్తుందో వారే అధ్యక్షుడు అవుతారని బండి సంజయ్ అన్నారు. పైరవీల ద్వారా మరో రకంగా పదవి దక్కదని తేల్చి చెప్పారు.
ఇక, అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అన్నది పార్టీ చూసుకుంటుందని చెప్పిన ఆయన.. ముఖ్యంగా సోషల్ మీడియాలో తామే కాబోయే అధ్యక్షులుగా ప్రచారం చేసుకుంటున్న వారికి పదవులు వరించావని బాంబు పేల్చారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నంతా మాత్రాన పదవి దక్కదన్నారు.
ఈటెలను ఉద్దేశించేనా?
కాగా, ముందు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే దుమారాన్ని రేపాయనుకుంటే మరింత దాన్ని రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజాసింగ్ అంటే ఓపెన్ కామెంట్స్ చేశారు. కానీ.. బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అన్నది రాజాసింగ్ నే అని కొందరు అంటుంటే..కాదు ఈటెల రాజేందర్ అని కొందరు చెప్తున్నారు.
నిజానికి, ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవి కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అంతేగాదు సోషల్ మీడియా ప్రచారంలో ఈటెలనే ముందు వరుసలో ఉన్నారని దాన్ని ఫాలో అయ్యే వాళ్లే చెప్తున్నారు. మరి ఇంతకి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అనేదే ఇప్పుడు ప్రశ్న.
ఇదిలావుంటే.. సోషల్ మీడియా ప్రచారంలో మిగతా నేతలందరి కంటే బండి సంజయే ముందు ఉంటారని, ఆయనే ఎక్కువ ఫోకస్ చేస్తారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. కొన్ని పోస్టులను కూడా వైరల్ చేస్తున్నారు.