KK survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు ఎవరిది?, ఏ పార్టీని విజయం వరించబోతోంది?.. అనే ఉత్కంఠ తెలుగురాష్ట్రాల ప్రజానీకంలో నెలకొంది. జనాల నాడిని పసిగడుతూ ఇప్పటికే కొన్ని సర్వేలు వెలువడగా, పాపులర్ అయిన కేకే సర్వే (KK survey) తాజాగా విడుదలైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో విపక్ష బీఆర్ఎస్ పార్టీకే (BRS) గెలుపు అవకాశాలు ఉన్నాయని కేకే సర్వే లెక్కగట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్‌పై గులాజీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాగంటి సునీత విజయం సాధిస్తారని విశ్లేషించింది.
ప్రాంతాలవారీగా సర్వే నిర్వహించగా, అధికార కాంగ్రెస్ పార్టీకి వెంగల్‌రావు, రెహమత్‌నగర్‌లలో అడ్వాంటేజ్ లభిస్తుందని కేకే సర్వే అంచనా వేసింది. ఇక, ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండ, శ్రీనగర్ కాలనీలలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి మైలేజీ ఉంటుందని తెలిపింది.
Read Also- Yadadri Collector: జిల్లా కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం.. ఆయన చేసిన మంచిపని ఏంటో తెలుసా?
బీఆర్ఎస్‌కు 55 శాతం ఓట్లు
బీఆర్ఎస్‌కు 55 శాతం, కాంగ్రెస్ పార్టీకి 37 శాతం ఓట్లు వస్తాయని కేకే సర్వేను నిర్వహించే కేకే శనివారం వెల్లడించారు. అయితే, బీజేపీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందన్నారు. ఆ పార్టీకి గతంలో ఈ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లలో కేవలం సగం మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తాము ఈ సర్వేను ఒక్కరోజులో నిర్వహించలేదని, చాలా రోజులపాటు నిర్వహించామని, నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభిప్రాయ సేకరణ చేసినట్టు కేకే వివరించారు.
Read Also- Kalvakuntla Kavitha: నేను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కవిత సంచలన కామెంట్స్
ఎంఐఎం పార్టీ మద్దతివ్వడం నవీన్ యాదవ్‌కు బలమనే విశ్లేషణలు వినిపిస్తుండగా, కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ అసదుద్దీన్ పిలుపు ఇచ్చినప్పటికీ, ముస్లింలు బీఆర్ఎస్‌కు ఓటు వేయబోతున్నారని కేకే పేర్కొన్నారు. మరి, నవంబర్ 11న నియోజకవర్గ ప్రజలు ఏం తేల్చబోతున్నారో వేచిచూడాలి.
