Kishan Reddy: ఓవైసీ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్నెర్ర..?
Kishan Reddy (imagecredit:twitter)
Political News, Telangana News

Kishan Reddy: ఓవైసీ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్నెర్ర.. అవన్నీ నడవవ్..?

Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీ రామ్ జీ పాలసీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవన భద్రతే లక్ష్యంగా ఈ నూతన పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. గతంలో ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచామని, నేరుగా కూలీల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేలా పారదర్శకత తీసుకువచ్చామని వివరించారు. దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ, డిజిటల్ చెల్లింపులు, స్పష్టమైన ఆడిట్ వ్యవస్థను ఇందులో భాగం చేశామన్నారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలన్న అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఓవైసీ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులను ఇక్కడ తీసుకురావాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.

Also Read: Municipal Elections: మునిసిపల్ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం!.. జనసేనతో పొత్తుపై క్లారిటీ!

అవన్నీ నడవవ్..

‘భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నందునే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. హిందువులు లేకపోతే ఇక్కడ ఎవరికీ రక్షణ ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని, మోదీ పాలనలో మతాల పేరుతో రాజకీయాలు నడవవని స్పష్టం చేశారు. పాత బస్తీలో చెరువులు, దళితుల బస్తీలను కబ్జా చేసిన చరిత్ర ఓవైసీదేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి దేశ భద్రతా చర్యలు ఓవైసీకి కనపడటం లేదా? అని నిలదీశారు. మతోన్మాద మజ్లిస్ పార్టీ సలహాలు బీజేపీకి అవసరం లేదని, దేశాభివృద్ధే తమ ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. జీ రామ్ జీ పథకం కేవలం గుంతలు తవ్వేది కాదని, వికసిత భారత్ లక్ష్యంగా గ్రామాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు దోహదపడుతుందని కిషన్ రెడ్డి వివరించారు.

Also Read: Water Sharing Issue: ఏళ్లపాటు ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణలు.. ఇప్పుడు ఏం చేద్దాం..?

Just In

01

SBI ATM charges: పెరిగిన ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే?, పూర్తివివరాలివే

Vegetable Farming: మహబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం.. అధికంగా పండించే పంట ఇదే..?

Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?

Macha Bollaram: రైల్వే బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస.. స్టేజ్‌పైనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వర్గాలమధ్య ఘర్షణ..!

Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా?: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్