Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశాలతో కోలిండియా తలసేమియా బాల సేవా యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా ప్రతి తలసేమియా బాధితుడికి రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ లో తలసేమియా బాలసేవా యోజన కార్యక్రమం కింద కోలిండియా లిమిటెడ్‌తో రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్ శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా అనేక రంగాల్లో కోలిండియా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
రెయిన్ బోతో ఒప్పందం
తెలంగాణలో తలసేమియాతో బాధపడుతున్న వారికి ఎముక మజ్జ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు కోలిండియాతో రెయిన్ బో ఆస్పత్రి ఒప్పందం చేసుకోవడం మంత్రిగా తనకు ఇంతకన్నా సంతోషం ఏదీ లేదన్నారు. తలసేమియాతో బాధపడే పిల్లలకు చికిత్స అందించడం చాలా కష్టమైన పని అని చెప్పరు. ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో కుంగిపోతారని, వారికి చేయూతనందించడం సంతోషం గా ఉందన్నారు. ఇప్పటి వరకు 17 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నామని, తాజాగా రెయిన్ బోతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 800 మంది పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేపట్టినట్లు వివరించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టిందని కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 42 కోట్ల మందికి ఉచితంగా చికిత్స అందించినట్లు చెప్పారు. దాదాపు రూ.1.75 లక్ష కోట్లను కేంద్రం ఖర్చు చేసిందన్నరు. తలసేమియా బాల సేవా యోజన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.
Also Read: Manchu Manoj: మంచు మనోజ్ మరో కొత్త ప్రయాణం ‘మోహన రాగ’ మ్యూజిక్ లేబుల్.. నాన్నకు ప్రేమతో!
త్వరలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి
సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందన్నారు. దాదాపు 96 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కొమురవెల్లి వెళ్తుంటారని, నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుందని పేర్కొన్నారు.
Also Read: Akhanda 2: ‘ఓజీ’ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడితేనే.. కొండంత బ్రేకీవెన్ టార్గెట్!
