Women Mart (i,agecredit:swetcha)
తెలంగాణ

Women Mart: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక మహిళలకు పండగే..?

Women Mart: మహిళా సాధికారతకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతోంది. వడ్డీలేని రుణాలతో పాటు పెట్రోల్ బంకులు, ఆదర్శ పాఠశాలలు, మహిళా క్యాంటీన్లు, స్కూల్ యూనిఫారమ్ స్టిచింగ్ వంటి రంగాల్లో అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు మహిళా మార్ట్‌(Women’s Mart)లతో మరో అడుగు ముందుకు వేసింది.

ఖమ్మం మహిళా మార్ట్ ను ఫైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసింది. ఈ మార్ట్ విజయవంతం కావడంతో, ఇతర జిల్లాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. తొలుత ఉమ్మడి జిల్లా కేంద్రాలైన వరంగల్(Warangal), నిజామాబాద్(Nizamabad), మహబూబాబాద్(Mehabubabad), మెదక్(Medak), నల్లగొండ(Nalgonda) లో నిర్మించాలని అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అందుకు అనువైన ప్రదేశాల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విడుతల వారీగా అన్ని జిల్లాల్లోనూ మార్ట్ లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అవికూడా సక్సెస్ అయితే మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఖమ్మం విజయం

ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ మూడు నెలల్లోనే మంచి ఫలితాలు సాధించింది. మహిళా సంఘాల కృషితో తయారైన ఉత్పత్తులకు మార్కెట్ లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు పెరిగి, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభించడమే కాకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు సరుకులు నేరుగా చేరుతున్నాయి. సహజసిద్ధమైన, నాణ్యమైన ఉత్పత్తులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఈ మార్ట్ ద్వారా గ్రామీణ, పట్టణ మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ప్రజలు, వినియోగదారులు చూపుతున్న విశ్వాసం మహిళా మార్ట్ విజయానికి బలమైన పునాది అయింది. త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులు, విభాగాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read: Harish Rao: తెచ్చి చూపించండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు ఛాలెంజ్

ఇప్పటివరకు 25లక్షల కొనుగోళ్లు

మార్ట్ లో ఇప్పటివరకు మహిళా సంఘాల నుంచి 25 లక్షల విలువైన ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో సుమారు రూ.35 వేల సేల్స్ ఉండగా, వారాంతంలో రూ.50 వేలు దాటుతున్నాయి. ఇప్పటివరకు రూ.18.75లక్షల అమ్మకాలు జరగగా, మూడు నెలల్లోనే మార్ట్ లాభాల బాటలో పయనిస్తోంది. నేరుగా విక్రయాలు జరపడం వల్ల ఉత్పత్తిదారులకు లాభం అదే విధంగా వినియోగదారులకు సరసమైన ధర లభిస్తోంది.

మహిళా సంఘాల ఉత్పత్తులు

ఈ మార్ట్‌లో 20 మండల సమాఖ్యల 95 మహిళా సంఘాలచే ఉత్పత్తి అయిన బియ్యం, బెల్లం, తేనే, మసాలా పొడులు, గానుగ నూనెలు, పూజా సామాగ్రి, పప్పులు, పిండులు, మిల్లెట్స్, చేనేత వస్త్రాలు, మట్టి పాత్రలు, వెదురు ఉత్పత్తులు, క్లీనింగ్ ప్రొడక్టులు, హస్తకళా వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మహిళా సంఘాలు స్వయంగా తయారు చేయడం వల్ల నమ్మకమైన, నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలలో వినియోగదారులకు చేరుతున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా టీ క్యాంటీన్

వినియోగదారుల రాక పెరగడంతో టీ క్యాంటీన్ ‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు 4 నుంచి 5 వేల రూపాయల సేల్స్ నమోదు అవుతోంది. ఇదే విధంగా భవిష్యత్ లో ఏర్పాటు చేయబోయే మార్టులలో కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వేలాదికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

మహిళా మార్ట్‌లో ప్రస్తుతం ఐదుగురు మహిళలు పనిచేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో మార్ట్‌ను విజయవంతంగా నడుపుతూ కుటుంబ ఆదాయానికి తోడ్పడటమే కాకుండా జిల్లా ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తున్నారు. పరోక్షంగా వందలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఉత్పత్తి, ప్యాకేజింగ్, రవాణా వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి వేలాది మందికి జీవనోపాధి కలుగుతోంది. మహిళా సంఘాలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకొని, సమాజంలో ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఖమ్మం మహిళా మార్ట్ మహిళల శక్తిని, సృజనాత్మకతను, కృషిని ప్రతిబింబిస్తూ జిల్లాలో మహిళల ఆర్థికసామాజిక అభివృద్ధికి, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి, సమాజ ప్రగతికి ఉదాహరణగా నిలుస్తోంది.

Also Read: Bathukamma 2025: తెలంగాణ పూల జాతర వచ్చేసింది.. ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే!

Just In

01

Shocking Incident: పాతబస్తీలో దారుణం.. మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఐదేళ్ల చిన్నారి.. చివరికి..?

Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా

Prabhas movie update: ‘రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి

Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ

TGMDC Sand Policy: లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!