ఖమ్మం స్వేచ్ఛ: Khammam Collector: కలెక్టరేట్ ప్రాంగణంలోని టీ స్టాల్ నిర్వహకురాలి కోరిక మేరకు కలెక్టర్ టీ సేవించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాయ్ లో ఆదే నాణ్యతను, రుచి కొనసాగిస్తున్నందుకు ప్రశంశిస్తు అద్బుతమైన రుచితో టీ బాగుంది చెల్లెమ్మ అంటూ కితాబు ఇవ్చారు. మహిళలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా స్త్రీ టీ స్టాల్స్ ను మరిన్ని ఖమ్మంలో నెలకొల్పి మహిళలను ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఖమ్మం జిల్లా సమీకృత కార్యాలయం బస్ స్టాప్ సెంటర్ లోని ఇందిరా మహిళా శక్తి స్త్రీ టీ స్టాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. స్త్రీ టీ స్టాల్ నిర్వహకురాలని కలెక్టర్ పలకరించారు. వేసవి కాలం దృష్ట్యా వ్యాపార అభివృద్ధిలో భాగంగా బటర్ మిల్క్, లెమన్ వాటర్, మిల్క్ షేక్, ఫాలుదా, పండ్ల రసాలు వంటివి విక్రయించేందుకు గల అవకాశాలు పరిశీలించుకోవాలని సూచించారు. పాల ఉత్పత్తులతో నాణ్యమైన లస్సీ తయారు చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని కలెక్టర్ సలహా ఇచ్చారు.
నూతనంగా వివిధ రకాల చల్లని ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశారు సంతోషం అని, ప్రజలకు నాణ్యమైన పదార్థాలు విక్రయిస్తూ మంచి లాభాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలిస్తూ ప్రస్తుత ఉన్న కాలాన్ని అనుగుణంగా ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యతను కొనసాగిస్తూ, నమ్మకాన్ని పెంచుకోవాలని సూచించారు. ఉపాధి పొందడమే కాక ఆర్ధిక బలంతో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఇందిరా మహిళా శక్తి యూనిట్లను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేసి నిర్వాకులకు వ్యాపారంలో తోడుగా అధికారులు ఉంటున్నారన్నారు. యూనిట్ కేటాయించాక ఏ మేరకు లాభాలు ఉంటాయనే అంశంతో పాటు వాటి నిర్వహణ, లాభాలను అంచనా వేస్తున్నామన్నారు.
Also Read: Rajiv Yuva Vikasam Scheme: నిరుద్యోగులూ.. అప్లై చేసుకున్నారా? కలెక్టర్ సమీక్ష