MLC Kavitha (imagecredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: జగదీష్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

MLC Kavitha: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ సందర్శించారు.

ఇక్కడ ప్రజల కన్నీళ్లు

అనంతరం కవిత మాట్లాడుతూ.. గతంలో డిండి ప్రాజెక్టు(Dindi Project) పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో జగదీష్ రెడ్డి ప్రమాణం చేసి, మాట తప్పారన్నారు. ఇప్పుడు ఆయనే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారని, డిండి ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తైతే వేలాది మందికి లాభం జరుగుతుందన్నారు. ఇక్కడ ప్రజల కన్నీళ్లు, బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఉన్నదని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Rajagopal Reddy) తీసుకోవాలని కోరారు. లేకపోతే తెలంగాణ జాగృతి తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కవిత హెచ్చరించారు.

Also Read; CM On Andesri: అందెశ్రీ పేరుతో స్మృతి వనం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. సీఎం రేవంత్

కొమ్మపల్లి గురుకుల పాఠశాల

అనంతరం కవిత దేవరకొండ మండలం కొమ్మపల్లి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో తరగతి గదిలో కూర్చుని ముచ్చటించారు. గురుకులంలో పరిస్థితులు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయని, ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యార్థులకు ఫెసిలిటీస్ కల్పించాలని కోరారు.

Also Read: Nagarjuna: వారికి కూడా ఆ సత్తా లేదంటున్న కింగ్ నాగార్జున.. ఎందుకంటే?

Just In

01

Chiranjeevi in Spirit: ‘స్పిరిట్’లో మెగాస్టార్ కామియోపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి.. కానీ చిరుతో..

Vakiti Srihari: మత్స్య కారుల అభివృద్ధికి కృషి.. రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం.. మంత్రి వాకిటి శ్రీహరి

Tollywood movie budget: టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం బడ్జెట్ పెరుగుతూ వస్తుంది.. దీనికి కారణం ఏంటంటే?

Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్‌-ఫలాహ్‌ యూనివర్శిటీ

Movie budget: సినిమాలకు పెట్టిన బడ్జెట్ నిజంగా అంత అవుతుందా.. ఎందుకు అలా చెప్తారు?