MLC Kavitha: ‘బీఆర్ఎస్ పాలనలో అమరులకు స్థూపం కట్టారు.. కానీ ఒక్క పథకానికి కూడా అమరుల పేరు పెట్టలేదు.. ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది ..కానీ శ్రీకాంతా చారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదు.. రాజీవ్, ఇందిర, మన్మోహన్ సింగ్ పేర్లను మాత్రం ప్రభుత్వ పథకాలకు పెడుతున్నారు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు అమరుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) లకు రాలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ లో బుధవారం శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఎల్బీ నగర్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అన్నారు. శ్రీకాంతా చారి త్యాగాన్ని మనం మాటల్లో కొలవలేం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది బిడ్డలు అసువులు బాసారని, వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని, కానీ కొంతమందికి మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందని, ఇంకా చాలామందిని ఆదుకోవాల్సి ఉందన్నారు. ఈ ఒరవడి మారి నిజంగా త్యాగం చేసిన వారికి గౌరవం దక్కాలి.. వారి పేర్లు చరిత్రలో నిలవాలన్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల జాగ, పెన్షన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మనం బిడ్డలు ప్రాణాలే త్యాగం చేశారని, కానీ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారని, తెలంగాణ(Telangana) ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నామన్నారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది.. మేము పెద్దగా ఆలోచిస్తామన్నారు. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది.. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నామన్నారు. తెలంగాణ ఎంత బాగుందో.. ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నామన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్ లో మాట్లాడానన్నారు. మేము బాగుండాలనే కోరుకుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోబోమన్నారు. మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప.. ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదన్నారు. ఆనాడు మీరు సినిమా నటుడిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏపీ డిప్యూటీ సీఎం.. మీ మాటలను ఆంధ్రా ప్రజలకు ఆపాదిస్తారు.. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలని హెచ్చరించారు.
Also Read: Commissioner Sunil Dutt: పోలీసులకు కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు.. తేడా రావద్దంటూ..!
రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి
ప్రభుత్వ ధనంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదినికి బుధవారం తెలంగాణ జాగృతి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సీఎం టూర్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మేము అభ్యంతరం చెబుతున్నామన్నారు. అర్బన్ ఏరియాల్లో ప్రజాధనంతో మీటింగ్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో సీఎం ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ టూర్ మీద ఆంక్షలు పెట్టాలి.. లేదంటే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Crime News: 150కి పైగా దొంగతనాలు చేసిన కరుడ గట్టిన దొంగ అరెస్ట్.. వాడి కన్నుపడితే ఇల్లు గుల్లే..!

