Kavitha – KTR Harish Rao: బీఆర్ఎస్ (BRS) అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేవారిలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (BRS) ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత ప్రాధాన్యత దృష్ట్యా హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR), కవిత (Kalvakuntla Kavitha) పేర్లు వినిపిస్తాయి. అయితే కేసీఆర్ తర్వాత ఆ స్థాయి ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా హరీష్ రావుకు పేరుంది. పార్టీని స్థాపించిన నాటి నుంచి హరీష్ రావు పార్టీలో చురుగ్గా ఉంటూ వచ్చారు. ఉద్యమ సమయంలో కేటీఆర్ కు కుడి భుజంగా నిలబడ్డారు. అటువంటి హరీష్ రావుకు ప్రస్తుతం పార్టీలో బ్యాడ్ టైమ్ నడుస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మెున్నటి వరకూ కేటీఆర్ (KTR) మాత్రమే హరీష్ రావును సైడ్ చేస్తూ వచ్చారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ సోదరి కవిత సైతం.. హరీష్ రావును డామినేట్ చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం మెుదలైంది.
ఆ భావన ఎందుకుంటే?
బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ (BRS Silver Jublee Celebrations) పనులు జోరుగా సాగుతున్నాయి. పార్టీ ముఖ్యనేతలుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఏర్పాట్లకు సంబంధించి బిజీ బిజీగా ఉన్నారు. అయితే సిల్వర్ జుబ్లీ వేడుకలకు సంబంధించి హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సడెన్ గా రజతోత్వస ఏర్పాట్లలో జోష్ పెంచారు. నిన్న మెున్నటి వరకూ ఏర్పాట్ల విషయంలో అంటి ముట్టనట్లు వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కుంభమేళా తరహాలో సభకు తరలి రావాలంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
హరీష్ ను సైడ్ చేస్తున్నారా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హరీష్ రావు మధ్య గ్యాప్ వచ్చినట్లు గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. సమర్థత కంటే వారసత్వానికే ఓటు కేసీఆర్ ఓటు వేశారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుమారుడు కేటీఆర్ కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. తన తర్వాత కేటీఆర్ అని అర్థం వచ్చేలా కేసీఆర్ వ్యవహారశైలి ఉందంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కుమార్తె కవిత సైతం రాజకీయాల్లో స్పీడ్ పెంచడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు కేటీఆర్ తర్వాత ఉన్న హరీష్ ను వెనక్కి నెట్టి అతడి స్థానం కవిత తీసుకుంటారా? అన్న చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో మెుదలైంది.
సామా ట్వీట్ కలకలం
టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy) సైతం ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. హరీష్ రావు స్థానంలో కవిత? అంటూ ఆయన పెట్టిన పోస్ట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ‘నేడు సభకి.. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కి.. ఇక హరీష్ దూరమేనా? అనూహ్య మలుపు తిరుగుతున్న గులాబీ పాలిటిక్స్’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పాలిటిక్స్ గమనిస్తే సామా రామ్మోహన్ రెడ్డి చెప్పింది నిజమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Pahalgam attackers: ఆర్మీ ట్రాప్ లో ఉగ్రవాదులు.. ఇక వారికి మూడినట్లే!
సైలెంట్ అయిన హరీష్?
ఒకప్పుడు వరుస ప్రెస్ మీట్లతో ప్రత్యర్థి పార్టీలపై మాటల దాడి చేసిన హరీష్ రావు.. గత కొన్నిరోజులుగా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఆయన ఉంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన రజతోత్సవ సభ బాధ్యతలను తన వారసులైన కేటీఆర్, కవితకు మాత్రమే కేసీఆర్ అప్పగించారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అందుకే బీఆర్ఎస్ కు ఎంతో కీలకమైన ఈ సమయంలో హరీష్ రావు సైలెంట్ అయిపోయారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.